కిడ్నీ బాధితులకు తప్పని కష్టాలు
నీటి కాలుష్యం, ఇతర కారణాలతో ఎ.కొండూరు మండ లంతో అత్యధికంగా తండాల ప్రజలు కిడ్నీ వ్యాధులు బారిన పడుతున్నారు. వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు గత ప్రభుత్వం ఎ.కొండూరులోనే డయా లసిస్ కేంద్రం ఏర్పాటు చేసింది. అంతే కాదు వైద్యులు ఇంటింటికీ వెళ్లి వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంది. ఏడాది కాలంలో అంతంత మాత్రంగా అందుతున్న వైద్య సేవలతో ఆరుగురు కిడ్నీ రోగులు మృత్యువాత పడ్డారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి సేవలు అందించే ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమం నిలిచిపోవడంతో ఆ ప్రభావం ఎక్కువగా కనిపించింది.


