మ్యాజిక్‌ డ్రెయిన్ల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

మ్యాజిక్‌ డ్రెయిన్ల పరిశీలన

Dec 26 2025 9:50 AM | Updated on Dec 26 2025 9:50 AM

మ్యాజ

మ్యాజిక్‌ డ్రెయిన్ల పరిశీలన

మ్యాజిక్‌ డ్రెయిన్ల పరిశీలన సాఫ్ట్‌ టెన్నిస్‌ సబ్‌ జూనియర్‌ జట్ల ఎంపిక ప్రమాద భరితంగా ఘాట్‌ రోడ్‌ మంగళగిరి టౌన్‌: మంగళగిరిలో ఎగువ సన్నిధిలో వేంచేసిఉన్న పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి వెళ్లే ఘాట్‌రోడ్‌ ప్రమాద భరితంగా మారింది. తరచూ ఘాట్‌రోడ్‌ మార్గంలో బండరాళ్లు జారిపడుతున్నాయి. దీంతో స్వామివారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఘాట్‌రోడ్‌ వెంబడి కొండకు రిటైనింగ్‌ వాల్‌ నిర్మిస్తే ప్రమాదాలు జరగవని, ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లక ముందే చర్యలు చేపట్టాలని భక్తులు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. రానున్న ముక్కోటి ఏకాదశి సందర్భంగా వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనార్థం రానున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని దేవస్థాన అధికారులు స్పందించి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, దేవాలయ పవిత్రతను కాపాడాలని భక్తులు కోరుకుంటున్నారు.

నందిగామ రూరల్‌: మండలంలోని సోమవరం గ్రామంలో మ్యాజిక్‌ డ్రెయిన్ల నిర్మాణ పనులను కేంద్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్‌ సెక్రటరీ రాజేష్‌ కుమార్‌ సింగ్‌ గురు వారం పరిశీలించారు. తొలుత గ్రామంలో ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించి వివరాలు అడిగి తెలు సుకున్నారు. సిమెంట్‌ డ్రెయిన్ల కన్నా తక్కువ ఖర్చుతో మ్యాజిక్‌ డ్రెయిన్ల నిర్మాణం జరుగుతోందని, దోమల వ్యాప్తి నివారణ, మురుగు నీరు నిల్వ లేకుండా భూమిలోకి ఇంకిపోవటం ప్రయోజనాలను తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీడీఓ ప్రసాదరావు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 500 మీటర్ల మేర మ్యాజిక్‌ డ్రెయిన్ల నిర్మాణం జరిగిందని మరో 400 మీటర్ల పనులు చేపట్టాల్సి ఉందని తెలిపారు. అనంతరం రాజేష్‌కుమార్‌సింగ్‌ను ఎంపీడీఓ, సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఏపీడీ నాగలక్ష్మీ, ఏపీఓ శరత్‌, డ్యూటీ ఇంజినీర్‌ సతీష్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఒడిశా లోని భువనేశ్వర్‌లో ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు జరిగే 19వ జాతీయస్థాయి సబ్‌ జూనియర్‌ సాఫ్ట్‌ టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌నకు ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రాతినిద్యం వహించే బాలురు, బాలికల జట్లను ఎంపిక చేశామని ఏపీ సాఫ్ట్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి డి.దిలీప్‌ కుమార్‌ ఓ ప్రకటనలో తెలి పారు. ఎంపికై న క్రీడాకారులు గురువారం విజయవాడ నుంచి బయలుదేరి వెళ్లారని పేర్కొ న్నారు. బాలుర జట్టుకు పి.వి.చిన్హాస్‌, ఎన్‌.క్రిష్‌ ధరణ్‌రెడ్డి, వి.జయరాం సంజయ్‌ (ఎన్టీఆర్‌ జిల్లా), ఎస్‌.ఈశ్వరహితేష్‌, ఎన్‌.అర్జున్‌ సాయి, ఎస్‌.కె.తంజీల్‌ (కృష్ణాజిల్లా), ఎం.హేమరామ్‌ శంకర్‌ (పల్నాడు జిల్లా), ఎన్‌.అవినాష్‌ (గుంటూరు), బాలికల జట్టుకు ఎ.శ్రీవైశాలి, జి. నిత్య, పి.జాహ్నవి, ఎస్‌.ఈశ్వరి (ఎన్టీఆర్‌ జిల్లా), బి.తేజశ్రీ (కాకినాడ), టి.కృష్ణ సత్యశ్రీ(గుంటూరు), డి.అలియా, కె.కావ్య (అనంతపురం) ఎంపికయ్యారని వివరించారు. ఈ జట్లకు అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వి.శ్రీనుబాబు, కోశాధికారి బి.నీరజ అభినందనలు తెలిపారు.

మ్యాజిక్‌ డ్రెయిన్ల పరిశీలన1
1/2

మ్యాజిక్‌ డ్రెయిన్ల పరిశీలన

మ్యాజిక్‌ డ్రెయిన్ల పరిశీలన2
2/2

మ్యాజిక్‌ డ్రెయిన్ల పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement