వత్సవాయి పోలీస్‌స్టేషన్ తనిఖీ
వత్సవాయి: కేసుల దర్యాప్తు, పరిష్కారం విషయంలో పోలీసులు పారదర్శకంగా వ్యవహరించాలని విజయవాడ డీసీపీ బి.లక్ష్మీనారాయణ సూచించారు. వత్సవాయి పోలీసుస్టేషన్‌ను గురువారం ఆయన తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ కేసుల విషయంలో పారదర్శకత వహించి తగున్యాయం చేయాలన్నారు. శాంతిభద్రతలను విఘాతం కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మండలం రాష్ట్ర సరిహద్దులో ఉన్న నేపథ్యంలో సరిహద్దు వద్ద బందోబస్తు పటిష్టంగా ఉండాలని పోలీసు సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో నందిగామ ఏసీపీ ఏబీజీ తిలక్, జగ్గయ్యపేట సీఐ పి.వెంకటేశ్వర్లు, వత్సవాయి ఎస్‌ఐ పి.ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


