ఒడిశా గవర్నర్‌కు వినతి
జన్మభూమికి అనపర్తిలో స్టాపేజీ
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): విశాఖపట్నం– లింగంపల్లి – విశాఖపట్నం జన్మభూమి ఎక్స్ ప్రెస్‌కు ప్రయోగాత్మకంగా అనపర్తి రైల్వేస్టేషన్‌లో స్టాపేజీ కల్పిస్తూ రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. విశాఖపట్నం – లింగంపల్లి (12805) ఎక్స్‌ప్రెస్ జనవరి ఆరో తేదీ నుంచి ఉదయం 8.49 గంటలకు అనపర్తి చేరుకుని 8.50 గంటలకు బయలుదేరుతుంది. అదేవిధంగా లింగంపల్లి – విశాఖపట్నం (12806) సాయంత్రం 4.16 గంటలకు అనపర్తి చేరుకుని, 4.17 గంటలకు బయలుదేరుతుంది.
షోలాపూర్–అనకాపల్లి రైలు పొడిగింపు
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఇప్పటి వరకు నడుస్తున్న షోలాపూర్–అనకాపల్లి ప్రత్యేక వారాంతపు రైలును ఫిబ్రవరి వరకు పొడిగించనున్నట్లు విజయవాడ రైల్వే పీఆర్‌వో నుస్రత్ మండ్రు ప్కర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. షోలాపూర్ – అనకాపల్లి (01477) ప్రత్యేక వారాంతపు రైలు జనవరి ఒకటో తేదీ నుంచి ఫిబ్రవరి 27వ తేదీ వరకు ప్రతి శుక్రవారం, అదే విధంగా అనకాపల్లి – షోలాపూర్ (01478) జనవరి 3 నుంచి ఫిబ్రవరి 28 వరకు ప్రతి శనివారం నడపనున్నారు.
చిలకలపూడి(మచిలీపట్నం): హిందుస్థాన్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన సౌత్ జోన్ అంతర్ విశ్వవిద్యాలయాల యువజనోత్సవాల్లో కృష్ణా విశ్వవిద్యాలయం విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు జరిగిన ఈ యువజనోత్సవాల్లో నృత్య పోటీల్లో కృష్ణా వర్సిటీ విద్యార్థులు ప్రథమ స్థానం సాధించటమే కాకుండా, 13 అంశాల్లో పలు బహుమతులు సాధించారు. క్లాసికల్ ఓకల్ సోలోలో ద్వితీయ బహుమతి, క్లాసిక్ ఫర్క్యూషన్‌లో నాలుగో స్థానం, క్లాసిక్ నాన్ ఫర్క్యూషన్‌లో ద్వితీయ స్థానం ఇలా పలు అంశాల్లో విజేతలుగా నిలిచారు. దక్షిణ భారత స్థాయి అంతర్ విశ్వవిద్యాలయాల్లో ప్రతిన కనమరిచి మూడో రన్నరప్‌గా నిలిచిన విశ్వవిద్యాలయ బృందాన్ని వైస్‌చాన్స్‌లర్ కె.రాంజీ, రెక్టార్ ఎం.వి.బసవేశ్వరరావు, రిజిస్ట్రార్ ఎన్.ఉష అభినందించారు.
ఒడిశా గవర్నర్‌కు వినతి


