విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి
పెనమలూరు: విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదిగే విధంగా శ్రమించాలని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి(ఎస్‌ఈఆర్డీ) డైరెక్టర్ మార్తల వెంకట కృష్ణారెడ్డి అన్నారు. పోరంకి మురళీ రిసార్ట్స్‌లో బుధవారం రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన 2025–2026 ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు మంచి నైపుణ్యం ప్రదర్శించారన్నారు. విజేతలైన విద్యార్థులు త్వరలో హైదరాబాద్‌లో జరగనున్న సదరన్ వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొని సత్తా చాటి బహుమతులు గెలవాలని కోరారు. ఈ ప్రదర్శనలో పాల్గొనే విద్యార్థుల్లో కనీసం 10 మందైనా శాస్త్రవేత్తలుగా ఎదగాలని అన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో తిరుపతి రీజనల్ సైన్స్ సెంటర్ క్యూరేటర్ పురుషోత్తం, వైజ్ఞానిక ప్రదర్శన నోడల్ ఆఫీసర్ నాగమణి, అన్ని జిల్లాల డీఈవోలు, ఎంఈవోలు, విద్యార్థులు పాల్గొన్నారు.
జాతీయ స్థాయి సైన్స్ ఫెయిర్ పోటీలకు మైలవరం విద్యార్థినులు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): జాతీయ స్థాయి సైన్స్‌ఫెయిర్‌కు ఎన్టీఆర్ జిల్లా విద్యార్థుల నమూనాలు ఎంపికై నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్. చంద్రకళ తెలిపారు. బుధవారం జరిగిన రాష్ట్ర స్థాయి సైన్స్‌ఫెయిర్‌లో జిల్లాకు చెందిన విద్యార్థులు ఎస్‌ఈఆర్‌టీ డైరెక్టర్ ఎంవీ కృష్ణారెడ్డి చేతుల మీదుగా బహుమతిని అందుకున్నట్లు తెలిపారు. జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణకు మైలవరంలోని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఇస్లావత్ రుక్మిణి, బత్తుల విజయదుర్గ ఎంపికై నట్టు చెప్పారు.
వైజ్ఞానిక ప్రదర్శనలో జిల్లా నుంచి ఇద్దరు ఎంపిక
పెనమలూరు: పోరంకిలో జరిగిన రాష్ట్రస్థాయి విద్యా వెజ్ఞానిక ప్రదర్శనలో కృష్ణా జిల్లా నుంచి ఇద్దరు దక్షిణ భారత స్థాయి పోటీకి ఎంపికయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి యూవీ సుబ్బారావు తెలిపారు. ఆయన బుధవారం పోరంకిలో వివరాలు తెలుపుతూ కృష్ణా జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన పోటీలో 11 మంది పాల్గొన్నారని, వారిలో ఇద్దరు ఎంపికయ్యారని చెప్పారు. గుడివాడ మాంటిస్సోరి ఇంగ్లిష్ మీడియం పాఠశాలకు చెందిన ఎస్.అశ్విన్‌కుమార్, ఉపాధ్యాయుల విభాగంలో మచిలీపట్నం మండలం గుండుపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన భౌతికశాస్త్రం ఉపాధ్యాయుడు బి.సోమేశ్వరరావు ఎంపికై నట్టు తెలిపారు. పోటీల్లో పాల్గొన్న జిల్లా విద్యార్థులు, ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు.
విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి
విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి


