కృష్ణా వర్సిటీలో మెగా జాబ్‌మేళా
కోనేరుసెంటర్: కృష్ణా విశ్వవిద్యాలయంలో సోమవారం మెగా జాబ్ డ్రైవ్ నిర్వహించారు. ఎనిమిది కంపెనీలకు చెందిన ప్రతినిధులు ప్రాంగణ ఎంపికల కార్యక్రమం చేపట్టారు. బీటెక్, బీ ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులు, పీజీ విద్యార్థులు మూడు వందలమంది హాజరవ్వగా నూట నలభై మంది ఎంపికయ్యారు. మ్యాజిక్ బస్ ఫౌండేషన్ సమన్వయంతో నిర్వహించిన మెగా జాబ్ డ్రైవ్‌లో ఎంపికై న వారికి ఉపకులపతి ఆచార్య కె. రాంజీ నియామక పత్రాలు అందజేశారు. ఎంపికై న విద్యార్థులను వీసీ అభినందించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య ఎన్.ఉష, ట్రైనింగ్, ప్లేస్మెంట్ సెల్ సమన్వయకర్త ఆచార్య వైకే సుందరకృష్ణ, డైరెక్టర్లు కిషోర్, హనుమంతరావు, అలీ మీర్జా, కృష్ణ, విజయశేఖర్, రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర చాంబర్ ఆఫ్ కామర్స్ ఈసీగా కొత్తూరి
తిరువూరు: ఏపీ ఫెడరేషన్ ఆఫ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా తిరువూరు చాంబర్ ఆఫ్ కామర్స్ సొసైటీ అధ్యక్షుడు కొత్తూరి గంగాధర్ నియమితులయ్యారు. సోమవారం రాష్ట్ర చాంబర్ అధ్యక్షుడు వక్కలగడ్డ భాస్కరరావు నియామకపత్రాన్ని గంగాధర్‌కు అందజేశారు.
కృష్ణా వర్సిటీలో మెగా జాబ్‌మేళా


