విజయవాడ సిటీ
న్యూస్‌రీల్
నిపుణులైన వైద్యులున్నా అందని సేవలు సౌకర్యాలు లేక ప్రైవేటుకు రిఫర్ చేస్తున్న వైద్యులు పట్టించుకోని ఈఎస్‌ఐ కార్పొరేషన్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఊసే లేదు తాత్కాలిక భవనాల్లో సౌకర్యాలు కల్పించని చంద్రబాబు ప్రభుత్వం నాలుగు జిల్లాల్లో 5.8 లక్షల చందాదారులకు తప్పని ఇబ్బందులు
గుడివాడకు చెందిన ఓ చందాదారుడు గుండె జబ్బు తో ఈఎస్‌ఐ ఆస్పత్రికి వెళితే ఓ కార్పొరేట్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడికెళితే గుండె సమస్యతో పాటు ఇతర సమస్యలు ఉన్నాయని, వాటికి కవర్ కాదంటూ అదనంగా డబ్బులు వసూలు చేశారు.
గాంధీనగర్‌కు చెందిన ఓ చందాదారుడు బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురి కాగా, ఈఎస్‌ఐ ఆస్పత్రి నుంచి నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ గుండె పరీక్షలు చేయాలంటూ అదనంగా వసూలు చేసినట్లు తెలిపారు.
ఇవే నిదర్శనం
ఎన్టీఆర్ జిల్లా
శనివారం శ్రీ 22 శ్రీ నవంబర్ శ్రీ 2025
పెనమలూరు: విద్యార్థులు సృజనాత్మకతతో నూతన ప్రాజెక్ట్‌లు ఆవిష్కరించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. కానూరు స్కాట్‌స్పైస్ అంతర్జాతీయ పాఠశాలలో శుక్రవారం అకడమిక్ ఫేర్ 2025–26ను ఆయన ప్రారంభించారు.
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారికి మిర్యాలగూడ వాస్తవ్యులు ఉజ్జిని శ్రీనివాసరావు, సౌజన్య దంపతులు శుక్రవారం రూ.1,00,001 విరాళంగా అందజేశారు.
రామవరప్పాడు: రతన్ టాటా ఇన్నొవేషన్ హబ్‌కు సంబంధించి ఎనికేపాడులోని స్పోక్ ప్రగతిపై నిరంతర పర్యవేక్షణ ఉంటోందని, హబ్ స్ఫూర్తికి అనుగుణంగా కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. ఎనికేపాడులోని ఆర్టీఐహెచ్ స్పోక్ కార్యాలయాన్ని శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఇలక్కియ సందర్శించారు. ఈ సందర్భంగా ఫిఫ్త్ ఏఐ టెక్నాలజీస్ స్టార్టప్‌నకు సంబంధించిన కో వర్కింగ్ స్పేస్‌ను ప్రారంభించారు. ఆర్టీఐహెచ్, ఎన్నారై ఇంజినీరింగ్ కళాశాల మధ్య ఎంవోయూ కుదుర్చుకున్నారు. అనంతరం ఆర్టీఐహెచ్ బృందం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్పోక్ ఇప్పటివరకూ సాధించిన ప్రగతితో పాటు భవిష్యత్ కార్యాచరణను వివరించారు. ఈ సంద ర్భంగా ఎన్టీఆర్ కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ మంచి ఆలోచనను ఆచరణలో పెట్టి పరిశ్రమల ఏర్పాటుకు దోహదపడేలా ఆర్టీఐహెచ్ కృషి చేస్తుందన్నారు. తొలిదశ పెట్టుబడులకు ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు, పథకాలను సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రస్తుత మార్కెట్‌కు అనుగుణంగా యువతలో ఎంటర్‌ప్రెన్యూర్ షిప్ దృక్పథాన్ని పెంపొందించేందుకు కళాశాల విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించడంపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. హ్యాకథాన్‌ల నిర్వహణకు కూడా స్పోక్ ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఆర్టీఐహెచ్ ప్రతినిధులు మాట్లాడుతూ యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఇప్పటికే 8 ప్రముఖ విద్యా సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఇప్పటివరకూ స్టార్టప్‌లు, ఎంటర్‌ప్రెన్యూర్స్ నుంచి 264 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఈవో జి.కృష్ణన్, ఇంక్యుబేషన్ హెచ్.రవితేజ, ఫైనాన్స్ హెడ్ హిమబిందు పాల్గొన్నారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఈఎస్‌ఐ చందా కడితే ఉచితంగా వైద్యం పొందవచ్చునని కార్మికులు భావిస్తుంటారు. అయితే ఆ కార్డు తీసుకుని ఈఎస్‌ఐ ఆస్పత్రికి వస్తే ఎంతమందికి వైద్య సేవలు అందుతున్నాయనేది ప్రశ్నార్ధకంగా మారింది. ప్రస్తుతం నిర్వహిస్తున్న తాత్కాలిక భవనాల్లో ఆపరేషన్‌లు నిర్వహించే పరిస్థితి లేదు. దీంతో చిన్న సర్జరీ చేయాలన్నా ప్రైవేటు ఆస్పత్రికి రిఫర్ చేస్తున్నారు. అక్కడికెళితే కొన్ని చికిత్సలు కవర్ కావంటూ అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం శిథిలావస్థలో ఉన్న భవనాల స్థానంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం ఊసే ఎత్తడం లేదు. దీంతో ఈస్‌ఐ చందాదారులకు ఇక్కట్లు తప్పడం లేదు.
నాలుగు జిల్లాలకు పెద్దదిక్కుగా...
ప్రస్తుతం విజయవాడలో ఉన్న ఈఎస్‌ఐ ఆస్పత్రి నాలుగు జిల్లాల్లోని సుమారు 5.8 లక్షల మంది చందాదారుల వైద్య సేవలకు పెద్దదిక్కుగా ఉంది. ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని చందాదారులు డిస్పెన్సరీల నుంచి మెరుగైన వైద్యం కోసం ఇక్కడకు వస్తుంటారు. ఇక్కడ మాత్రం తాత్కాలిక భవనాల్లో అరకొర సౌకర్యాలతో సేవలు అందని పరిస్థితి నెలకొంది. నిపుణులైన వైద్యులు ఉన్నా, తాత్కాలిక భవనాల్లో ఆపరేషన్ థియేటర్‌లతో సర్జికల్ పరికరాలు లేక పోవడంతో శస్త్ర చికిత్సలు నిర్వహించడం లేదు. దీంతో చిన్నపాటి శస్త్ర చికిత్స చేయాలన్నా ప్రైవేటు ఆస్పత్రికి రిఫర్ చేస్తున్నారు.
ప్రైవేటులో అదనపు వసూళ్లు
ఈఎస్‌ఐ ఆస్పత్రి నుంచి రిఫర్ చేయించుకుని ప్రైవేటు ఆస్పత్రికి వెళితే అక్కడ అదనంగా డబ్బులు చెల్లించాల్సి వస్తోందని పలువురు చందా దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు సూపర్ స్పెషాలిటీ సేవలకు మాత్రమే ప్రైవేటు ఆస్పత్రులకు రిఫర్ చేసేవారు. ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ, గైనకాలజీ వంటి విభాగాల్లో ఈఎస్‌ఐ ఆస్పత్రిలోనే సర్జరీలు చేసేవారు. ఇప్పుడు సౌకర్యాల లేమితో అన్ని శస్త్ర చికిత్సలకు ప్రైవేటుకు పంపిస్తున్నారు. అక్కడికెళితే కొన్ని చికిత్సలకు ఈస్‌ఐ కవరేజ్ రాదంటూ రోగుల నుంచి అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ విషయమై ఈస్‌ఐ అధికారులకు కార్మిక సంఘాలు ఫిర్యాదులు చేసినప్పటికీ చర్యలు ఉండటం లేదు.
కలగానే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి
ఐదు దశాబ్దాల నాడు నిర్మించిన ఈఎస్‌ఐ ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరడంతో దాని స్థానంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలని గతంలో భావించారు. దీంతో తాత్కాలిక భవనాలను నిర్మించి, వైద్య సేవలను అక్కడకు మార్చారు. తాత్కాలిక భవనాల్లోకి మారి ఏడాదిన్నర గడుస్తున్నా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం ఊసే ఎత్తడం లేదు. ఒకప్పుడు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లేవారు. రాష్ట్ర విభజన తర్వాత రిఫర్ చేసే అవకాశం లేదు. దీంతో విజయవాడలో సూపర్ స్పెషాలిటీ సేవలు అందించేలా అత్యాధునిక సౌకర్యాలతో ఈఎస్‌ఐ ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలని భావించినా, అది కార్యరూపం దాల్చడం లేదు. దీంతో చందాదారులకు ఇక్కట్లు తప్పడం లేదు.
9
ఇలా వీళ్లిద్దరే కాదు అనేక మంది ఈఎస్‌ఐ చందాదారులు ఇలా వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు.
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ


