పెద్ద దిక్కుకు నిర్లక్ష్యపు జబ్బు
కనిపించని ప్రభుత్వ చొరవ
టెండర్లు పిలిచాం
విజయవాడ జీజీహెచ్‌లో ఆధునిక వైద్య పరికరాల కొరత
లబ్బీపేట(విజయవాడతూర్పు): పేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తూ పెద్ద దిక్కుగా నిలవాల్సిన విజయవాడ ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్) సర్కారు నిర్లక్ష్యం కారణంగా కునారిల్లుతోంది. ఆధునిక వైద్య పరికరాలను సమకూరిస్తే మరింత నాణ్యమైన సేవలు అందిస్తామని పాల కులు, ఉన్నతాధికారులకు ఆస్పత్రి వైద్యులు విన్నవించినా స్పందన కనిపించడంలేదు. అరకొరగా ఉన్న మొండి పరికరాలతో కుస్తీ పడుతూ వైద్య సేవలు అందించడంతోపాటు శస్త్ర చికిత్సలు చేయాల్సి దయనీయ పరిస్థితి నెలకొంది. ప్రభుత్వాస్పత్రిలో నైపుణ్యం కలిగిన వైద్యులు అందుబాటులో ఉన్నప్పటికీ, ఆధునిక పరికరాలు లేక పోవడంతో పూర్తిస్థాయిలో సేవలు అందించలేక పోతున్నారు. అవసరమైన పరికరాలు లేకపోవడంతో అత్యవసర సమయాల్లో రోగులను గుంటూరు ప్రభుత్వాస్ప త్రికి వెళ్లాల్సిందిగా వైద్యులు సూచిస్తున్నారు.
కావాల్సిన పరికరాలు ఇవీ..
గుడివాడకు చెందిన 50 ఏళ్ల రోగి కిడ్నీల వాపుతో బాధపడుతూ 20 రోజుల కిందట ప్రభుత్వాస్పత్రికి వచ్చాడు. అతడిని క్యాజువాలిటీలో పరీక్షించిన వైద్యులు యూరాలజీ విభాగంలో ఆధునిక పరికరాలు లేకపోవడంతో గుంటూరు వెళ్లాలని సూచించారు. చేసేది లేక, అంబులెన్స్ మాట్లాడుకుని గుంటూరు తరలివెళ్లాడు.
విజయవాడ గాంధీనగర్‌కు చెందిన ఓ మహిళ విరేచనంలో రక్తం పడుతుండటంతో ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. ఆమెకు పెద్దపేగు పరీక్ష చేసేందుకు కొలనోస్కోపీ అందుబాటులో లేక పోవడంతో గుంటూరు వెళ్లాలని వైద్యులు సూచించారు. ఆమె ఆ పరిస్థితిలో అంత దూరం వెళ్లలేక స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకుంది. ఇలా నిత్యం అనేక మంది రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రభుత్వాస్పత్రిల్లో ఆధునిక సౌకర్యాలు కల్పించే విషయంలో ప్రభుత్వం చొరవ కొరవడిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైద్యులు ఏది కావాలన్నా స్పందించే వారే ఉండటం లేదు. ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధుల సమీక్షల్లో సమస్యలపై వైద్యులు ఏకరువు పెడుతున్నా స్పందన శూన్యం. దీంతో రోగులు ఆధునిక సేవలు అందడం లేదు. గత ప్రభుత్వ హయాంలో సమకూర్చిన పరికరాలతోనే వైద్యులు కుస్తీ పట్టాల్సి వస్తోంది. దీంతో రోగులకు ఒక్కోసారి ఇబ్బందులు తప్పడం లేదు.
వెంటిలేటర్లు, వర్క్‌స్టేషన్ల కొనుగోలుకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. కొద్దిరోజుల్లోనే అందుబాటు లోకి రానున్నాయి. మరిన్ని పరికరాలు సమకూరనున్నాయి. రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తిస్థాయిలో సేవలు అందిస్తున్నాం.
– డాక్టర్ ఎ.వెంకటేశ్వరరావు,
సూపరింటెండెంట్, జీజీహెచ్
పెద్ద దిక్కుకు నిర్లక్ష్యపు జబ్బు


