ఎన్టీఆర్ జిల్లా జేసీ ఆకస్మిక తనిఖీలు
తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియా గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వ హించారు. ఎ.కొండూరు మండలం కృష్ణారావుపాలెం సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలను సందర్శించిన ఆమె మధ్యాహ్న భోజనం నాణ్యత పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని ఉపాధ్యాయు లను ఆదేశించారు. ఎ.కొండూరులో వెంకట సాయి మిల్లును తనిఖీ చేసి ధాన్యం త్వరితగతిన రైతుల నుంచి సేకరించి సకాలంలో బిల్లులు అందేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైనన్ని గన్నీ బ్యాగులు సరఫరా చేయాలని ఆదేశించారు. కంభంపాడులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కూడా జేసీ పరిశీలించారు. తిరువూరు మండలం లక్ష్మీపురంలో ధాన్యం కళ్లాలను పరిశీలించి, దళారులకు ధాన్యం విక్రయించవద్దని, ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు రైతు సేవా కేంద్రాల్లో విక్రయించాలని రైతులకు సూచించారు. విస్సన్నపేట మండలం తాతకుంట్లలో స్వామిత్ర సర్వే పరిశీలించారు. రెడ్డిగూడెం, మద్దులపర్వ గ్రామాల్లోనూ జేసీ ఇలకియా ధాన్యం అమ్మకాల్లో రైతుల ఇబ్బందులను తెలుసుకున్నారు. తిరు వూరు రెవెన్యూ డివిజనల్ అధికారి కె.మాధురి, పౌరసరఫరాల డెప్యూటీ తహసీల్దారు శ్వేత, తిరువూరు, విస్సన్నపేట, ఎ.కొండూరు, రెడ్డిగూడెం తహసీల్దార్లు పాల్గొన్నారు.
24 నుంచి జాతీయ సంగీతోత్సవాలు
విజయవాడ కల్చరల్: నగరంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత కళాశాల వేదికగా శ్రీ సద్గురు సంగీత సభ ఈ నెల 24 నుంచి వారం రోజులు 32వ వార్షిక జాతీయ సంగీతోత్సవాలు నిర్వహించనుంది. 24వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు వి.దీపిక, వి.నందిక గాత్ర యుగళంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 25న నిరంజన్ దిండోడీ, 26న స్వరాత్మిక శ్రీకాంత్, 27న సాయి విఘ్నేష్, 28న సర్వేపల్లి సోదరీమణులు, 29న లంక తేజస్విని గాత్ర కచేరీలు జరుగుతాయి. 29న సమాగతి పేరుతో జగల్ బందీగా విదుషి శ్రీవిద్య, అంగార సిన్హా కూచిపూడి నృత్యం, శుభానాగరాజ్ ఒడిస్సీ నృత్య ప్రదర్శన జరుగుతుంది. 30వ తేదీన వయోలిన్ విద్వాంసుడు పాలపర్తి నాగేశ్వరరావుకు సంగీత విద్వన్‌మణి బిరుదు ప్రదానం చేస్తారు. అనంతరం ఆయన వయోలిన్ కచేరి జరుగుతుంది.
బులియన్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడికి అరుదైన పురస్కారం
జగ్గయ్యపేట అర్బన్: జగ్గయ్యపేట బులియన్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీరాం సుబ్బారావుకు అరుదైన పురస్కారం లభించింది. 75 ఏళ్లకు పైబడి బంగారు ఆభరణాల వ్యాపారంలో కొనసాగుతున్నందుకు ఏపీ జెన్ అండ్ జ్యువెలరీ ఫెయిర్, ఏపీ బులియన్ మర్చంట్ అసోసియేషన్ సంయుక్తంగా ప్రత్యేక పురస్కారం అందజేయనుంది. ఈ నెల 21వ తేదీన విజయవాడలోని ఓ హోటల్‌లో సుబ్బారావు దంపతులను బులియన్ మర్చంట్, జ్యువెలరీ అండ్ జెమ్ ఫెయిర్ నిర్వాహకులు సత్కరించనున్నారు. ఎన్టీఆర్ జిల్లా నుంచి ఈ అరుదైన పురస్కారం అందుకుంటున్న ఏౖకైక బులియన్ మర్చంట్‌గా సుబ్బారావు ఘనత సాధించనున్నారు. ఈ సందర్భంగా షరాబు వర్తక సంఘం ప్రధాన కార్యదర్శి కొంకిమళ్ల మల్లికార్జునరావు, షరాబు వ్యాపారులు, స్వర్ణకారులు హర్షం వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ జిల్లా జేసీ ఆకస్మిక తనిఖీలు


