
విజయవాడ సిటీ
న్యూస్‌రీల్
పాతబస్తీలో టీడీపీ దోపిడీపై బీజేపీ తిరుగుబాటు బీజేపీ ఆటోస్టాండ్‌ను అడ్డుకున్న టీడీపీ నేత పార్కింగ్ పేరుతో అడ్డగోలు వసూళ్లకు పాల్పడుతున్న టీడీపీ నేతలు టీడీపీ అక్రమదందాకు మాజీ ఎమ్మెల్సీ మద్దతు?
ఎన్టీఆర్ జిల్లా
ఆదివారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 2025
టీడీపీ బీజేపీ
బీజేపీ జెండా తీసేయండి..!
7
తిరువూరు: మెగా డీఎస్సీలో ఎ.కొండూరు మండలం రేపూడి తండాకు చెందిన భూక్యా జాన్సన్ 100కు 95 మార్కులు సాధించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎస్జీటీ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచారు. జాన్సన్‌ను గ్రామస్తులు అభినందించారు.
అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై పరిశ్రమలశాఖ డెప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్
చల్లరపు శైలేంద్రకుమార్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): బెజవాడ దుర్గమ్మ ఆలయం సమీపంలో ఆటో స్టాండ్ వ్యవహారం కూటమి పార్టీల నేతల మధ్య రగడకు దారి తీసింది. ఆ పార్టీ నేతలు రోడ్డుపైన బాహాబాహీకి దిగి బహిరంగంగానే ఒకరిపై ఒకరు దాడి చేసుకునే దాకా వెళ్లింది. సాక్షాత్తూ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ అతని అనుచరులపై టీడీపీ నేత మైలవరపు వీరబాబు దాడికి తెగబడటంపై నగర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం దిగువన రథం సెంటర్ సమీపంలో రహదారులను ఆక్రమించి వ్యాపారాలను నిర్వహిస్తున్న హాకర్లను ఇటీవల అధికారులు తొలగించారు. హాకర్ల వలన భక్తుల రాకపోకలకు సైతం ఇబ్బందులు తలెత్తడంతో అధికారులు ఈ చర్యలు చేపట్టారు. హాకర్లతో పాటుగా అక్కడ ఉన్న ఆటోస్టాండ్‌ను సైతం తొలగించారు. అయితే ఆటో డ్రైవర్లు తమకు న్యాయం చేయాలని అడ్డూరి శ్రీరామ్ ద్వారా స్థానిక ఎమ్మెల్యే సుజనాచౌదరిని కలిసి అభ్యర్థించారు. సుజనాచౌదరి ఆదేశాలతో అడ్డూరి శ్రీరామ్ ఇతర బీజేపీ నేతలు అధికారులతో సంప్రదించి రథం సెంటర్‌కు అవతల వైపు కెనాల్‌ను ఆనుకొని ఉన్న బొడ్డు బొమ్మ వద్ద ఆటోస్టాండ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
టీడీపీ నేతలు అక్రమ వసూళ్లు చేస్తున్నారు
టీడీపీ నేత మైలవరపు వీరబాబు టెండర్ ఫాంలో ఆ ప్రాంతం లేకపోయినా అక్రమంగా దుర్గగుడికి వచ్చే భక్తుల నుంచి పార్కింగ్ పేరుతో వందలాది రూపాయలు వసూలు చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై తాము నగరపాలకసంస్థ అధికారులను సంప్రదించామని, వీరబాబు పాడుకున్న టెండర్‌లో ఈ ప్రాంతం లేదని చెప్పినట్లు వారు చెబుతున్నారు.
దాడి ఘటనపై బీజేపీ అధిష్టానం సీరియస్
సాక్షాత్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్‌పైనే టీడీపీ నేత దాడికి తెగబడటం నగరంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. బీజేపీ అధిష్టానం సైతం దీనిని సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. బీజేపీకి చెందిన సుజనాచౌదరి ఎమ్మెల్యేగా ఉన్న వెస్ట్ నియోజకవర్గంలో స్థానికంగా టీడీపీ నేతలు అధికారాన్ని చెలాయిస్తూ వివిధ రూపాల్లో డబ్బులు దండుకోవటం తదితర అంశాల నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య అంతర్గతంగా గొడవలు సాగుతున్నాయి. అక్రమ పార్కింగ్ వసూళ్ల వెనుక మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ సీనియర్ నేత ఉన్నారని, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
వాటాల పంపకంలో తేడాతోనే వివాదం
వాటాల పంపకంలో కూటమి పార్టీల నేతల మధ్య చోటు చేసుకున్న వివాదం వలనే వారి మధ్య ఈ రగడ చోటు చేసుకుందనే ప్రచారం స్థానికంగా వినిపిస్తోంది. ప్రధానంగా సుజనాచౌదరి స్థానికంగా లేకపోవటంతో నగరపాలకసంస్థ వ్యవహారాలను బీజేపీకి చెందిన సీనియర్ నేతలు చూస్తున్నారు. ఆ క్రమంలో పార్కింగ్ టెండర్ల విషయంలో టీడీపీ నేతలు వాటాలు పంచుకోవటం, అక్రమ వసూళ్ల వ్యవహారంలో ఎమ్మెల్యేకు వాటాలు ఉన్నాయనే ప్రచారం రావటంతో బీజేపీ నేతలు రగిలిపోతున్నారు. తాజాగా వాటాల పంపకంలో తేడాలు రావటంతో రోడ్డుపైనే బాహాబాహీకి దిగారనే మాటలు వినిపిస్తున్నాయి.
జయంతి గ్రామంలో స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయిస్తున్న కలెక్టర్ లక్ష్మీశ
స్వర్ణ ఆంధ్ర.. స్వచ్ఛ ఆంధ్రలో కలెక్టర్ లక్ష్మీశ
బొడ్డుబొమ్మ సమీపంలో భారతీయ జనతా పార్టీకి చెందిన ట్రేడ్ యూనియన్ సంఘం బీఎంఎస్ జెండా, ఆటో స్టాండ్ బోర్డును ఏర్పాటు చేసేందుకు అడ్డూరి శ్రీరామ్ సూచనలతో ఆటోడ్రైవర్లు సమాయత్తమయ్యారు. వాటిని ఆవిష్కరించే సమయంలో మైలవరపు వీరబాబు అడ్డూరి శ్రీరామ్‌కు ఫోన్ చేశాడు. ‘‘అక్కడ నేను నగరపాలకసంస్థ నుంచి పార్కింగ్ పాడుకున్నాను, నాకు నష్టం వస్తుంది. ఆ డబ్బులు మీరిస్తారా...?’’ అంటూ ప్రశ్నించాడు. దానికి ‘శ్రీరామ్ ఫోన్‌లో వద్దు ఇక్కడకు రా...’ అని సమాధానం ఇచ్చాడు. మైలవరపు వీరబాబు అక్కడకు వచ్చి ఇక్కడ బీజేపీ జెండా ఎలా పెడతారు? తీసేయండి అంటూ తీసేందుకు ప్రయత్నించాడు. దీంతో అడ్డూరి శ్రీరామ్ ఇతర బీజేపీ నేతలు వీరబాబును అడ్డుకునే క్రమంలో వారి మధ్య బాహాబాహీ చోటు చేసుకుంది. కాసేపటికి టెండర్ ఫారంలో హద్దులు చూపించి అప్పుడు మాట్లాడతామని సర్దిచెప్పటంతో వీరబాబు వెనుకకు వెళ్లాడు.

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ