
రేపు నున్నలో సాఫ్ట్ బాల్ జట్ల ఎంపిక
పెనమలూరు: కొద్ది నెలల క్రితం పెనమలూరులో జరిగిన హత్య కేసులో నిందితుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సీఐ వెంకటరమణ కథనం మేరకు.. పెనమలూరు మహిళా మండలి కాలువ కట్టపై ఉంటున్న డేరంగుల పిచ్చయ్యకు ఓ మహిళతో వివాదం తలెత్తింది. ఆ మహిళకు మద్దతుగా వేల్పుల రమణ (అఖిల్), ముగ్గురు బిహార్ యువకులు పిచ్చయ్యతో గొడవపడి దాడి చేసి హత్య చేశారు. ఈ కేసులో నలుగురు నింది తుల్లో అఖిల్‌ను పోలీసులు ఘటన జరిగిన వెంటనే అరెస్టు చేశారు. మిగితా నిందితులు బిహార్‌కు చెందిన వారు కావటంతో వారు దొరకలేదు. నిందితుల్లో ఒకరైన బిహార్ రాష్ట్రానికి చెందిన విపిన్ సహానీని పోలీసులు పెనమలూరులో శనివారం అరెస్టు చేశారు. అతడిని కోర్టులో హాజరుపరచగా నెల్లూరు జైలుకు రిమాండ్ విధించారు. ఈ కేసులో నిందితులను పట్టుకునే విష యంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మృతుడి బంధువులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఒక ఎస్‌ఐపై బదిలీ వేటు కూడా పడింది. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.
జగ్గయ్యపేట అర్బన్: భార్య ఫిర్యాదుతో తనపై పోలీసులు కేసు నమోదు చేశారనే మనస్తాపంతో భర్త ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణ శివారులోని తొర్రగుంటపాలెంలో శనివారం జరిగింది. పట్టణ ఎస్‌ఐ జి.రాజు కథనం మేరకు.. తొర్రగుంటపాలెంలో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న రామ కృష్ణ(34)కు నాలుగేళ్ల క్రితం సత్తెనపల్లికి చెందిన యువతితో వివాహం జరిగింది. భార్యాభర్తల మద్య గొడవలు రావడంతో కొంత కాలంగా రామకృష్ణ భార్యకు దూరంగా ఉంటున్నాడు. ఇటీవల భార్య ఫిర్యాదు మేరకు మాచర్ల పోలీసులు రామకృష్ణపై కేసు నమోదుచేశారు. విచారణకు వస్తున్నామని పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఆందోళనకు గురైన రామకృష్ణ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతిచెందాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.