అనారోగ్యానికి పచ్చజెండా | - | Sakshi
Sakshi News home page

అనారోగ్యానికి పచ్చజెండా

Aug 24 2025 2:06 PM | Updated on Aug 24 2025 2:06 PM

అనారో

అనారోగ్యానికి పచ్చజెండా

అనారోగ్యానికి పచ్చజెండా ● పోరంకికి చెందిన ఉద్యోగి గొల్లపూడిలోని కార్యాలయంలో పనిచేస్తుంటాడు. అక్కడి నుంచి కార్యాలయానికి 18 కిలోమీటర్లు దూరం ఉంటుంది. కానీ ఆయన వెళ్లేందుకు గంట పడుతుంది. అంతేకాదు ట్రాఫిక్‌లో డ్రైవింగ్‌ వత్తిడితో పాటు కాలుష్యం కారణంగా ఇటీవల తీవ్రమైన రక్తపోటుకు గురయ్యాడు. ● పటమటకు చెందిన ఉద్యోగి గన్నవరంలో పనిచేస్తుంటాడు. ప్రతిరోజూ తన బైక్‌పై కార్యాలయానికి వెళ్తుంటాడు. ఇటీవల హైపర్‌టెన్షన్‌తో పాటు, బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురయ్యాడు. పొల్యూషన్‌ కూడా కారణమేనని వైద్యులు తేల్చారు. ● ట్రాఫిక్‌లో ప్రయాణించే వారు యాంగ్జయిటీకి గురవుతున్నారు. అప్పటికే యాంగ్జయిటీ ఉన్న వారు తీవ్రమైన వత్తిళ్లకు గురవుతున్నారు. ● యాంగ్జయిటీకి గురయ్యే వారు కార్యాలయానికి వెళ్లిన గంట వరకూ పనిపై దృష్టి పెట్టలేక పోతున్నారు. ● నిత్యం ట్రాఫిక్‌లో డ్రైవింగ్‌ చేసే వారికి పొల్యూషన్‌ వలన రక్తం చిక్కపడి గుండెపోటు, మెదడుపోటు వచ్చే అవకాశం ఉంది. ● నిత్యం ట్రాఫిక్‌లో డ్రైవింగ్‌ చేసే వారు చిన్న వయస్సులోనే హైపర్‌టెన్షన్‌ బారిన పడే అవకాశం ఉంది. ● ట్రాఫిక్‌లో ప్రయాణంతో నిద్ర సమస్యలు తలెత్తుతున్నాయి. ● ఎక్కువ సేపు డ్రైవింగ్‌ చేసే వారిలో స్పైన్‌(వెన్నెముక) సమస్యలు వస్తున్నాయి. ● ట్రాఫిక్‌ చిక్కులతో కోపం, ఆవేశం, చిరాకు పెరుగుతుంది. ● బైక్‌పై ప్రయాణించే వాళ్లు మాస్క్‌ ధరించడం మేలు, పొల్యూషన్‌ ప్రభావం చూపదు. ● వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గించి, పబ్లిక్‌ వాహనాల్లో ప్రయాణిస్తే ట్రాఫిక్‌ సమస్య తగ్గుతుంది. ● నిత్యం ప్రయాణించే వారు యోగా, మెడిటేషన్‌ చేయాలి. ● పొల్యూషన్‌ బారిన పడకుండా రక్షణ చర్యలు చేపట్టాలి.

నగరంలో విపరీతంగా పెరిగిన వ్యక్తిగత వాహనాలు ట్రాఫిక్‌లో ప్రయాణంతో అనారోగ్య సమస్యలు రక్తపోటు అధికమవుతుంది అంటున్న వైద్యులు యాంగ్జయిటీ, నిద్రలేమి సమస్యలు ఎక్కువే కాలుష్యంతో రక్తం చిక్కపడి స్ట్రోక్‌కు దారితీయొచ్చు

ట్రాఫిక్‌లో డ్రైవింగ్‌తో సమస్యలు

లబ్బీపేట(విజయవాడతూర్పు): విజయవాడలో ఒక అర్ధగంట బైక్‌పై ప్రధాన రోడ్లపై తిరిగితే చాలు అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లే. టన్నుల కొద్దీ కాలుష్యాన్ని వెదజల్లే కాలం చెల్లిన బస్సులు, ఇతర వాహనాల నుంచి వచ్చే పొల్యూషన్‌ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతుంది. అనేక ప్రాణాంతక వ్యాధులకు సైతం కారణంగా నిలుస్తుంది. నిత్యం నగర రోడ్లపై ప్రయాణించే వారిలో శారీరక, మానసిక సమస్యలు పెరుగుతున్నట్లు వైద్యులు చెపుతున్నారు. రక్తం చిక్కపడి గుండెపోటు, మెదడు పోటుతో పాటు, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందంటున్నారు. నిద్రలేమి సమస్యతో పాటు, అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నట్లు వెల్లడిస్తున్నారు.

ఇవే నిదర్శనం

ఇలా వీరిద్దరే కాదు. నగరంలోని ట్రాఫిక్‌తో అనేక మంది అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు.

వైద్యులు గుర్తించిన సమస్యలివే...

ఏం చేయాలి...

ట్రాఫిక్‌ రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు డ్రైవింగ్‌ చేయడం ద్వారా కొందరు యాంగ్జయిటీకి గురవుతారు. యాంగ్జయిటీ ఉన్న వారు చికాకుతో రాష్‌ డ్రైవింగ్‌ చేస్తుంటారు. నిద్రలేమి, హైపర్‌టెన్షన్‌ భారినపడుతున్న వారు ఉంటున్నారు. ముఖ్యంగా కాలుష్యం ప్రభావంతో రక్తం చిక్కపడి బ్రెయిన్‌స్ట్రోక్‌, హార్ట్‌స్ట్రోక్‌కు దారితీయొచ్చు. వెన్నెముక సమస్యలతో బాధ పడుతున్న వారు మా వద్దకు వస్తున్నారు. పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టును వినియోగించడం మేలు. వాహనదారులు హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌ తప్పనిసరిగా ధరించాలి.

– డాక్టర్‌ డి.అనిల్‌కుమార్‌,

న్యూరాలజిస్ట్‌, విజయవాడ

అనారోగ్యానికి పచ్చజెండా1
1/1

అనారోగ్యానికి పచ్చజెండా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement