
విజయవాడ సిటీ
ఎన్టీఆర్ జిల్లా
బుధవారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 2025
11
ఘనంగా వినాయకునికి
సంకటహర చతుర్థి పూజలు
అమరావతి: స్థానిక అమరేశ్వరాలయంలోని విఘ్నేశ్వరస్వామి ఉపాలయంలో మంగళవారం సంకటహర చతుర్థి పూజలను నిర్వహించారు. స్వామి వారికి పుష్పాలు, గరికతో విశేషాలంకారం చేశారు.
18 నుంచి టీటీడీ పవిత్రోత్సవాలు
వెంకటపాలెం(తాడికొండ): ఈ నెల 18 నుంచి 21 వరకు వెంకటపాలెంలోని టీటీడీలో పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ పర్యవేక్షణాధికారి మల్లికార్జున తెలిపారు.
తిరుపతమ్మకు బోనాలు
పెనుగంచిప్రోలు: శ్రీతిరుపతమ్మవారికి మంగళవారం జగ్గయ్యపేట మండలం గండ్రాయి గ్రామానికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో పాలు, పొంగళ్లతో బోనాలు సమర్పించారు.
తిరువూరు: అదిగో ఇస్తాం.. ఇదిగో ఇస్తాం అంటూ టిడ్కో ఇళ్ల విషయంలో ప్రజాప్రతినిధులు, అధికా రులు దాటేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన టిడ్కో ఇళ్లను తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి విస్మరించింది. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 12 ప్రదేశాల్లో 24,792 టిడ్కో ఇళ్లను నిర్మించి పట్టణ పేదలకు పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు 2017లో పనులు చేపట్టారు. సొంతిల్లు లేని పేద కుటుంబాలకు మూడు కేటగిరీల ఇళ్లను కేటాయించడానికి నిర్ణయించారు. కేటగిరీ–1లో 300 చదరపు అడుగుల్లో సింగిల్ బెడ్‌రూమ్ ఫ్లాట్లను, కేటగిరీ–2లో 365 చదరపు అడుగుల్లో సింగిల్ బెడ్‌రూమ్ ఇళ్లను, కేటగిరీ–3లో 430 చదరపు అడుగుల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం జరిపారు. కేటగిరీ–1 ఇళ్లకు రూ.5.72 లక్ష లు యూనిట్ ధర కాగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరి రూ.1.50 లక్షల చొప్పున నిర్మాణ వ్యయం భరించాలి. మిగిలిన రూ.2.71లక్షలను బ్యాంకు ద్వారా రుణం తీసుకోవాలని కేంద్రం మార్గదర్శకాలిచ్చింది. ఈ కేట గిరీ ఇళ్లకు లబ్ధిదారు రూ.500 చెల్లిస్తే సరిపోతుంది.
సొమ్ము తిరిగి ఇవ్వలేదు
కేటగిరీ–2లో యూనిట్ నిర్మాణ వ్యయం రూ.6.74 లక్షలు, రూ.50వేలను లబ్ధిదారు వాటాగా నాలుగు విడతల్లో చెల్లించాలి. కేటగిరీ–3 ఇళ్లకు రూ.లక్ష లబ్ధి దారు వాటా నాలుగు విడతల్లో చెల్లించే అవకాశం కల్పించారు. కేటగిరీ 2, 3 ఇళ్లకు లబ్ధిదారులు వాటా సొమ్ము చెల్లించినా డిమాండ్‌కు సరిపడా ఫ్ల్లాట్ల నిర్మాణం చేపట్టలేదు. ఆ యూనిట్లను రద్దు చేసినట్లు అధికారులు నోటీసులు జారీ చేసినా, లబ్ధిదారులు చెల్లించిన సొమ్ము తిరిగి ఇవ్వలేదు.
హామీలు గాలికి...
తాము ఎన్నికల్లో గెలిస్తే వెంటనే టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులు పూర్తిచేసి లబ్ధిదారులందరికీ అప్పగిస్తామని కూటమి పార్టీలు ఎన్నికల హామీలో పేర్కొన్నా ఇప్పటివరకు పనులు పునఃప్రారంభించలేదు. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గుడివాడలో 77 ఎకరాల్లో నిర్మించిన 8900 టిడ్కో ఇళ్లను గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 2023లో లబ్ధిదారులకు పంపిణీ చేసింది. బందరులో 2,304 ఫ్లాట్ల నిర్మాణం చేపట్టగా 544 ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించారు. తిరువూరు శివారు పీటీకొత్తూరులో 1536, నందిగామ హనుమంతుపాలెంలో 240, జగ్గయ్యపేటలో 3,168, విజయవాడ జక్కంపూడిలో 6,576, ఉయ్యూరులో 2,496, మచిలీపట్నంలో 1,760 టిడ్కో ఇళ్లను పూర్తిచేయాల్సి ఉంది.
దాటవేత ధోరణి
కూటమి నేతలను టిడ్కో ఇళ్ల కోసం పలు సందర్భాల్లో ప్రజా సంఘాలు నిలదీస్తున్నా సరైన సమాధానం రావట్లేదు. లబ్ధిదారులకు అన్ని సదుపాయాలు కల్పించిన టిడ్కో ఇళ్లను త్వరలోనే పంపిణీ చేస్తామని చెప్ప డం మినహా ఎప్పటికిస్తారో చెప్పలేకపోతున్నారు.
న్యూస్‌రీల్
టిడ్కో ఇళ్ల కోసం ఎదురుచూపులు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మరచిన కూటమి మాట దాటేస్తున్న నేతలు సొంతింటి కోసం సొమ్ము చెల్లించిన పేదలు
వరదొస్తోంది.. అప్రమత్తంగా ఉండండి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వర్షాలతో పాటు ఎగువ నుంచి కృష్ణా నదికి వరద నీరు పోటెత్తే అవకాశం ఉందని, ప్రకాశం బ్యారేజీకి ఎగువ, దిగువ ప్రాంతాల్లో 24/7 అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ ఆదేశించారు. ప్రజలను కూడా అప్రమత్తం చేయాలన్నారు. మంగళవారం కలెక్టర్ లక్ష్మీశ.. ఆర్‌డీవోలతో పాటు ఇరిగేషన్, రెవెన్యూ, వీఎంసీ తదితర విభాగాల అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అంతేకాక ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తుతోందని, క్రమేణా 4–5 లక్షల క్యూసెక్కులకు కూడా చేరుకునే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో 91549 70454 నంబరుతో కలెక్టరేట్ కంట్రోల్ రూమ్‌ను యాక్టివేట్ చేయాలని, పునరావాస శిబిరాలను కూడా సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
మచిలీపట్నంఅర్బన్: జిల్లా స్థాయి ఉత్తమ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల ఎంపిక కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కృషా జిల్లా విద్యాశాఖాధికారి రామారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అవార్డులు ప్రదానం చేయనున్నారన్నారు. దరఖాస్తులను రెండు ప్రతులుగా సంబంధిత తనిఖీ అధికారుల సిఫారసులతో పాటు ఈనెల 25వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సమర్పించాలన్నారు.
జాతీయ ఉపకారవేతనాల కోసం..
దివ్యాంగ విద్యార్థులు జాతీయ ఉపకారవేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని వికలాంగ సంక్షేమశాఖ సహాయ సంచాలకుడు పి.కామరాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 9, 10వ తరగతి విద్యార్థులు ఆగస్టు 31లోగా, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా విద్యార్థులు అక్టోబరు 31వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ