
పోలీస్ గ్రీవెన్స్‌కు 73 ఫిర్యాదులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు 73 ఫిర్యాదులు అందాయి. పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్ ఉదయరాణి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా భూ వివాదాలు, ఆస్తి వివాదాలు, నగదు లావాదేవీలకు సంబంధించి 36 ఫిర్యాదులు, భార్యాభర్తలు, కుటుంబ కలహాలపై 7, కొట్లాటకు సంబంధించి 3, వివిధ మోసాలపై 3, మహిళా సంబంధిత నేరాలు 5, దొంగతనాలపై 3, ఇతర చిన్న వివాదాలకు సంబంధించి 16 ఫిర్యాదులు అందాయి. ఆయా ఫిర్యాదులను సంబంధిత పోలీస్‌స్టేషన్లకు తెలిపి సత్వర పరిష్కారం చేయాలని డీసీపీ ఉదయరాణి ఆదేశాలు జారీ చేశారు.