
అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపండి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అందిన అర్జీలకు నిర్ణీత గడువులోగా పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అధికారులను ఆదేశించారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. పెండింగ్, బియాండ్ ఎస్‌ఎల్‌ఏ, రీ ఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు పరిష్కారం చూపాలన్నారు. ఎప్పటికప్పుడు పరిష్కరించడంతోపాటు పెండింగ్ వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే వినతులను అధికారులు ఎప్పటికప్పడు లాగిన్‌లో పరిశీలించి పరిష్కరించాలన్నారు. రీ ఓపెన్ కేసులను కూడా పూర్తిగా విచారణ జరిపి ముగించాలని, గడువులోగా వినతులకు సమాధానాలు పంపాలని జాయింట్ కలెక్టర్ ఇలక్కియ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం. లక్ష్మీనరసింహం, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి.జ్యోతి, కేఆర్‌సీసీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ కె. పోసిబాబు, ఏసీపీ కె. వెంకటేశ్వరరావు వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
వచ్చిన అర్జీల వివరాలు..
పీజీఆర్‌ఎస్‌లో మొత్తం 126 అర్జీలు అందాయని జేసీ చెప్పారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 36, పోలీస్ 20, డీఈఓ 16, వీఎంసీ 9, సర్వే 7 ఏీపీసీపీడీసీఎల్ 5, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపులు 4, విభిన్నప్రతిభావంతులు 3, డీఎంహెచ్‌వో 3, డీఆర్డీఏ 3, పౌరసరఫరాలు 2, ఎంపీడీఓ 2, ఆర్‌ఐవో (ఇంటర్‌మీడియట్) 2, పశుసంవర్ధక, ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్, డీసీహెచ్‌ఎస్, డీసీఓ (సహకార శాఖ), జిల్లా జలవనరులు, ఎకై ్సజ్ పోలీసు, మత్స్యశాఖ, అటవీ, జీజీహెచ్, హౌసింగ్, పరిశ్రమలు, మైనారిటీ, ఆర్‌అండ్‌బీ, సోషల్ వెల్ఫేర్‌కు సంబంధించి ఒక్కొక్క అర్జీ చొప్పున అందాయన్నారు.
జాయింట్ కలెక్టర్ ఇలక్కియ