
క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలి
మొగల్రాజపురం(విజయవాడతూర్పు): యువత చదువుతో పాటు క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు ఎం.రాజయ్య అన్నారు. సిద్ధార్థ అకాడమీ స్వర్ణోత్సవాల సందర్భంగా సిద్ధార్థ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా ఇన్విటేషనల్ వాలీబాల్(సీ్త్ర, పురుషులు) టోర్నమెంట్‌ను సోమవారం సాయంత్రం పీబీ సిద్ధార్థ కళాశాల మైదానంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ.. తమ విద్యా సంస్థల్లో చదువుతో పాటు క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. క్రీడల వల్ల చదువుపై ఏకాగ్రత పెరుగుతుందన్నారు. సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు మాట్లాడుతూ తమ అకాడమీ స్వర్ణోత్సవాల సందర్భంగా ఈ వాలీబాల్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నామన్నారు. సిద్ధార్థ అకాడమీ జాయింట్ సెక్రటరీ నిమ్మగడ్డ లలిత ప్రసాద్, పీబీ సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.రమేష్, కళాశాల డైరెక్టర్ వేమూరి బాబూరావు పాల్గొన్నారు.
హోరాహోరీగా పోటీలు..
ప్రారంభ సభ అనంతరం ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ(చైన్నె) జట్టుతో బిషప్ మోర్ కళాశాల(కేరళ) జట్టు, సిద్ధార్థ కళాశాల జట్టుతో హోలీ గ్రేస్ అకాడమీ(త్రిసూర్, కేరళ) టీమ్‌లు తలపడ్డాయి. కపార్గామ్(కోయంబత్తూర్) టీమ్‌తో శాయ్(గుజరాత్) జట్టు, లయోలా కళాశాల(చైన్నె)జట్టుతో శాయ్(త్రివేండ్రం) జట్ల మధ్య పోటీలు జరిగాయి. వాలీబాల్ పోటీలను క్రీడాకారులతో పాటు క్రీడాభిమానులు, విద్యార్థులు వీక్షించారు.
ఆల్ ఇండియా ఇన్విటేషనల్ వాలీబాల్
టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో అతిథులు