మాతాశిశు మరణాల నివారణే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

మాతాశిశు మరణాల నివారణే లక్ష్యం

Aug 8 2025 7:02 AM | Updated on Aug 8 2025 7:02 AM

మాతాశిశు మరణాల నివారణే లక్ష్యం

మాతాశిశు మరణాల నివారణే లక్ష్యం

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌):జిల్లాలో మాతా, శిశు మరణాల నివారణే లక్ష్యంగా ఆశా కార్యకర్త నుంచి వైద్యాధికారి వరకు ప్రతిఒక్కరూ నిబద్ధతతో, క్రమశిక్షణతో సేవలందించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయంలో మాతా శిశు మరణాల నివారణకు పర్యవేక్షణ, ప్రతిస్పందన కమిటీ సమీక్షా సమావేశం గురువారం నిర్వహించారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం మొదలు నమోదైన రెండు మాతృ, ఐదు శిశు మరణాలపై వైద్య ఆరోగ్య శాఖ, వైద్యాధికారులు, స్పెషలిస్ట్‌ వైద్యులు, క్షేత్రస్థాయి సిబ్బందితో సమీక్షించారు. మరణాలకు కారణాలను విశ్లేషించడంతో పాటు కుటుంబ సభ్యుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ లక్ష్మీశ మాట్లాడుతూ ప్రతి ప్రాణమూ అత్యంత విలువైనదని చెప్పారు. తీసుకున్న చిన్నచిన్న జాగ్రత్తలే మాతాశిశు ప్రాణాలకు రక్షణగా నిలుస్తాయని పేర్కొన్నారు. హైరిస్క్‌ ఉన్న గర్భిణులపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. శిశువులకు టీకాలు కూడా సరైన విధంగా వేసేలా మార్గదర్శనం చేయాలన్నారు. డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఎం.సుహాసిని, డెప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ జె.ఇందుమతీదేవి, జిల్లా సీ్త్ర శిశు సంక్షేమం, సాధికారత అధికారి షేక్‌ రుక్సానా సుల్తానా బేగం పాల్గొన్నారు.

సాగు నీటి యాజమాన్యం ప్రధానం....

వ్యవసాయ, ఉద్యాన పంటల సాగులో సాగునీటి యాజమాన్యం చాలా ప్రధానమైనదని జిల్లా కలెక్టర్‌ జి.లక్ష్మీశ తెలిపారు. కలెక్టరేట్‌ ప్రాంగణంలో ఏపీ మైక్రో ఇరిగేషన్‌ పథకం (ఎంఐపీ) కార్యాలయం ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటుచేసిన ఇగ్నైట్‌సెల్‌ను కలెక్టర్‌ లక్ష్మీశ సందర్శించారు. సాగునీటి వనరుల సద్వినియోగంలో భాగంగా బిందు, తుంపర సేద్యంపై రైతులకు అవగాహన పెంచాలని సూచించారు. జిల్లాలో 2024–25 వరకు 23,937 హెక్టార్లు సూక్ష్మ సేద్యం కింద ఉందని, 2025–26లో కొత్తగా 2,200 హెక్టార్లను ఈ విధానంలోకి తీసుకొచ్చేలా అధికారులు కృషిచేయాలని ఆదేశించారు. సూక్ష్మ సేద్యంపై అవగాహన పెంచేందుకు రూపొందించిన కరపత్రాలను, డ్రిప్‌, స్ప్రింకర్‌, రైన్‌ గన్‌లకు సంబంధించిన పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ లక్ష్మీశ మాట్లాడుతూ సాగునీరు, కరెంటు వినియోగంలో 50 శాతం పొదుపు సూక్ష్మ సేద్యంతో సాధ్యమవుతుందని వెల్లడించారు. పీడీ పి.ఎం.సుభాని, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.

వయోవృద్ధుల సంరక్షణ విస్మరిస్తే చర్యలు

వయోవృద్ధుల సంరక్షణ బాధ్యతల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ హెచ్చరించారు. జిల్లా కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో గురువారం విభిన్న ప్రతిభావంతుల హిజ్రాల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ సంరక్షణ చట్టం– 2007, వారి పోషణ, సంరక్షణ నియమావళి– 2011 పై జిల్లా స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ తల్లిదండ్రులు సంరక్షణ, పోషణ చూడాల్సిన బాధ్యత పిల్లలపై ఉందన్నారు. వయోవృద్దులు ఎవరైనా కార్యాలయాలకు వస్తే వారికి సరైన మార్గదర్శనం చేయాలన్నారు. కార్యక్రమంలో ముందుగా హెరిటేజ్‌ ఫౌండేషన్‌ ప్రాజెక్టు హెడ్‌ టి.రవి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా చట్టం పై అధికారులకు అవగాహన కల్పించారు. ఏడీ వి. కామరాజు, జెడ్పీ సీఈవో కన్నమనాయుడు, మున్సిపల్‌ కమిషనర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement