ఎన్టీటీపీఎస్‌ వైద్యశాల ఉద్యోగులను కొనసాగిస్తాం | - | Sakshi
Sakshi News home page

ఎన్టీటీపీఎస్‌ వైద్యశాల ఉద్యోగులను కొనసాగిస్తాం

Aug 7 2025 11:07 AM | Updated on Aug 7 2025 11:07 AM

ఎన్టీటీపీఎస్‌ వైద్యశాల ఉద్యోగులను కొనసాగిస్తాం

ఎన్టీటీపీఎస్‌ వైద్యశాల ఉద్యోగులను కొనసాగిస్తాం

ఇబ్రహీంపట్నం: ఎన్టీటీ పీఎస్‌ వైద్యశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులను తొలగించబోమని, వారిని కొనసాగిస్తామని, ఎప్పటిలాగే నాణ్యమైన మందులు, ఉద్యోగులకు మెరుగైన వైద్య పరీక్షలు అందిస్తామని ఎన్టీటీపీఎస్‌ చీఫ్‌ ఇంజినీర్‌ శివ రామాంజనేయులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ‘అమ్మేసినట్లేనా?’ శీర్షికన ‘సాక్షి’లో బుధవారం కథనం ప్రచురిత మైంది. ఈ కథనానికి చీఫ్‌ ఇంజినీరు శివ రామాంజనేయులు పైవిధంగా స్పందించారు. నిపుణులైన వైద్యులతో మెరుగైన వైద్యం అందించేందుకే ఈ విధానం పాటించామని పేర్కొన్నారు. గతంలో మాదిరిగానే ప్రముఖ కంపెనీల మందులు అందజేయాలని, అందరు ఉద్యోగులను కొనసాగించాలని ప్రైవేట్‌ సంస్థకు ఆదేశాలు ఇచ్చినట్లు ఆ ప్రకటనలో సీఈశివ రామాంజనేయులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement