ప్రజలకు చేరువలో ప్రసూతి ఆస్పత్రులు ఉండాలి..
ప్రసవాల కోసం గర్భిణులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దూర ప్రాంతాల నుంచి విజయవాడ జీజీహెచ్‌కు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వంలో పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులను ఆధునీకరించడంతో పాటు ప్రసూతి సౌకర్యాలు కల్పించింది. ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రసూతి ఆస్పత్రిని ఏర్పాటు చేసి అక్కడ గైనకాలజిస్టులను నియమించడంతో పాటు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచింది. ప్రస్తుతం పీహెచ్‌సీల్లో ప్రసవాలు అరకొరగా జరుగుతున్నాయి. పూర్తిస్థాయిలో ప్రసవాలు జరిగేలా చూడాలి.
– సంపతి విజిత, జిల్లా అధ్యక్షురాలు, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం


