
నటరాజుకు నృత్య నీరాజనం
సమ్మోహనం.. అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా ప్రదర్శన చేస్తున్న కళాకారులు
నృత్యద్భుతం..
కూచిపూడి ప్రదర్శన చేస్తున్న
కళా
కారిణి
విజయవాడ కల్చరల్: అంతర్జాతీయ నృత్య దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ, ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ నృత్య సంగీత కళాశాల ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా సంగీత కళాశాలలోని గోకరాజు గంగరాజు కళావేదికపై కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి, భరతనాట్యం, కథక్, ఫోక్ నృత్యాలు జాతీయ సమైక్యతను చాటాయి. నాట్యాచార్యులు సీహెచ్ అజయ్‌కుమార్, భాగవతుల సౌమ్య, శైలశ్రీ, పద్మశ్రీ హేమంత్, సప్తా శివకుమార్, భాగవతుల వెంకట్రామశర్మ, యల్లా జోస్యుల అనూరాధ, సంతోష్, ఉమామహేశ్వర పాత్రుడు, అనూషా నాయుడు, త్రినాథాచారి, ఉషామాధవి, అలివేలు మంగతాయారు, రాయన శ్రీనివాసరావు, శారదా రామకృష్ణ. చంద్రశేఖర్, చదలవాడ ఆనంద్ బృంద సభ్యులు అందరూ కలిపి దాదాపు 300 మంది పాల్గొన్నారు.
పలువురికి సత్కారం..
ఈ సందర్భంగా సంగీత రంగానికి చెందిన శాంతిశ్రీ, ప్రముఖ నాట్యాచార్యుడు జోస్యుల శ్రీ రామచంద్రమూర్తి, మేకప్ ఆర్టిస్, నాట్యగురువులు మొత్తం 21 మందిని నిర్వాహకులు ఆత్మీయంగా సత్కరించారు. సంగీత కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీనరసమ్మ జ్యోతిని వెలిగించి కార్యక్రమాలను ప్రారంభించారు. భాషా సాంస్కృతిక శాఖ మేనేజర్ శ్రీనివాస్, వ్యాఖ్యాత అన్నపూర్ణ నిర్వహించారు.

నటరాజుకు నృత్య నీరాజనం