
చదువుల సరస్వతులకు సత్కారం
మచిలీపట్నంఅర్బన్: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో జిల్లాలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాల్లో ఉంటూ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియెట్ మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చాటిన విద్యార్థినులను జిల్లా యంత్రాంగం ఘనంగా సత్కరిం చింది. ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఉంటూ జూనియర్ కళాశాలల్లో విద్యను అభ్యసిస్తున్న 143 మందిలో 104 మంది ఉత్తీర్ణులు కాగా ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో మొత్తం 79 మంది విద్యార్థులలో 73 మంది ఉత్తీర్ణత సాధించారు.
968 మార్కులు సాధించిన శ్యామలీల
ఎస్సీ సంక్షేమ బాలికల వసతి గృహాల్లోని విద్యార్థినులు ఇంటర్ మొదటి సంవత్సరంలో 73 శాతం, ద్వితీయ సంవత్సరంలో 93 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఎన్. శ్యామలీల అత్యధికంగా ఎంపీసీలో 968 మార్కులు సాధించింది. వొకేషనల్ ఎంపీహెచ్‌డబ్ల్యూలో కాకర రమ్య 964 మార్కులు, బైపీసీలో కె.మేఘన సంధ్య 954 మార్కులు, సీఈసీలో కుతాడ సిరి 926, వొకేషనల్ ఏజీటీలో పెద్ది రమామణి 910, సీఈసీలో బూర్ల లక్ష్మి 903 మార్కులు సాధించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో వొకేషనల్ ఎమ్మెల్టీ కోర్సులో దాసి వర్ష, వి.చంద్రిక 480, దండాబత్తిన వెన్నెల 475, బోయిన ఈశ్వరి నాగజ్యోతి 475 మార్కులు సాధించారు. వొకేషనల్ ఏజీటీ కోర్సులో చాట్రగడ్డ అనుష్క 478 మార్కులు, ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సులో ఎల్.షైనీ 473 మార్కులు, సీఈసీ కోర్సులో పుట్టి పూర్ణిమ 438, ముంగర మెర్రీ గోల్డ్ 416 మార్కులు సాధించారు. ఎంపీసీలో బదిన కొండలమ్మ 424, ఎ.సాయి నవ్యశ్రీ 420 మార్కులు సాధించారు. బైపీసీలో విశ్వనాథపల్లి కెంపు రత్నం 401 మార్కులు సాధించారు.
విద్యార్థినులకు జ్ఞాపికలు
ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన 17 మంది ఎస్సీ సంక్షేమ బాలికల వసతి గృహాల్లోని విద్యార్థినులకు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం అభినందన జ్ఞాపికలు అందజేశారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని ఎన్.శ్యామలీల(968)తో పాటు ఇతర విద్యార్థినులను అభినందించారు.
ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థినులు ఎస్సీ సంక్షేమ బాలికల వసతి గృహాల్లోని విద్యార్థినుల అత్యుత్తమ ప్రదర్శన ఇంటర్ మొదటి సంవత్సరంలో 73 శాతం ఉత్తీర్ణత ద్వితీయ సంవత్సరంలో 93 శాతం ఉత్తీర్ణత