పోలీస్ ప్రజావాణిలో 83 ఫిర్యాదులు
విజయవాడస్పోర్ట్స్: పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి 83 ఫిర్యాదులు స్వీకరించినట్లు డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ) ఎ.బి.టి.ఎస్.ఉదయరాణి తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో ఆస్తి, నగదు లావాదేవీల వివాదాలు పరిష్కరించాలని 53 మంది, కుటుంబ కలహాలపై 10, మహిళా సంబంధిత నేరాలపై ఐదు, మోసాలపై మూడు, కొట్లాటపై ఒకరు, స్వల్ప వివాదాలపై 11 మంది ఫిర్యాదులు ఇచ్చినట్లు వెల్లడించారు. సదరు ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.


