రహదారి భద్రతా మాసోత్సవాలు ప్రారంభం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాను రహదారి ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమష్టి భాగస్వామ్యం అవసరమని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. గురువారం నుంచి ఈ నెల 31వ తేదీ వరకు 37వ రహదారి భద్రతా మాసోత్సవాలు జరగనున్నాయని తెలిపారు. ఈ మాసోత్సవాల పోస్టర్లను కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ కలెక్టరేట్‌లో రవాణా శాఖ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శిక్షణతో భద్రత, సాంకేతికత ద్వారా పరివర్తన ఇతివృత్తంతో రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈ మాసోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. సమన్వయ శాఖల అధికారుల భాగస్వామ్యంతో ఈ మాసోత్సవాల సందర్భంగా వివిధ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వివిధ రకాల పోటీలు, ర్యాలీలు, సమావేశాలు వంటివి నిర్వహించనున్నట్లు వివరించారు.
హెల్త్ యూనివర్సిటీకి కెనరా బ్యాంక్ సాయం
లబ్బీపేట(విజయవాడతూర్పు): డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయంలో సోలార్ పవర్ యూనిట్ ఏర్పాటుకు కెనరా బ్యాంక్ రూ.40 లక్షల సాయం అందించింది. ఆ బ్యాంక్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ మొత్తాన్ని వర్సిటీ వీసీ డాక్టర్ పి.చంద్రశేఖర్‌కు బ్యాంక్ డీజీఎం ఎ.రత్నాకరరావు చెక్కు రూపంలో గురువారం అందజేశారు. ఈ సంద ర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. సామాజిక బాధ్యతగా బ్యాంకులు నిధులను నూతన సంవత్సరం రోజు అందజేయడం అభినందనీయమన్నారు. ఈ నిధులతో సోలార్ యూనిట్ ఏర్పాటు ద్వారా 100 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చునని పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారి సమాజాన్ని అతలాకుతం చేసిన సమయంలో ఎన్నో కార్పొరేట్ సంస్థలు తమ వంతు సామాజిక బాధ్యతగా ముందుకొచ్చి మాస్కులు, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, శానిటైజర్లు అందించాయని గుర్తుచేశారు. నూతన సంవత్సరం సందర్భంగా కేక్‌కట్‌చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వేమిరెడ్డి రాధికారెడ్డి, ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ సూర్యప్రభ, పబ్లికేషన్స్ డైరెక్టర్ డాక్టర్ సుధ తదితరులు పాల్గొన్నారు.
మచిలీపట్నంఅర్బన్: వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ (వైఎస్‌ఆర్టీఏ) నూతన సంవత్సర క్యాలెండర్, డైరీని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు పేర్ని వెంకటరామయ్య (నాని) గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. వారి సేవలకు వైఎస్సార్ టీచర్స్ అసో సియేషన్ అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల ఐక్యత, వృత్తిపరమైన అభివృద్ధికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని సూచించారు.
మంగళగిరి టౌన్: నూతన సంవత్సరం సందర్భంగా గురువారం మంగళగిరి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు. తెల్లవారుజాము నుంచి దిగువ, ఎగువ సన్నిధి ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, నూతన సంవత్సరంలో మంచి జరగాలని కోరుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్ కుమార్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
రహదారి భద్రతా మాసోత్సవాలు ప్రారంభం
రహదారి భద్రతా మాసోత్సవాలు ప్రారంభం
రహదారి భద్రతా మాసోత్సవాలు ప్రారంభం


