జగదభిరాముడి కల్యాణం వేళ.. జగమంతా ఆనందంతో పరవశించింది. రాతిని నాతిని చేసిన మహిమాన్వితుడు రఘురాముడి పెళ్లి సందర్భంగా వాడవాడాలా రామనామ స్మరణతో పులకించింది. ఉమ్మడి జిల్లాలో శ్రీరామనవమి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పల్లెలు, పట్టణాల్లో రామాలయాల్లో తెల్లవారుజాము నుంచే భక్తుల సందడి కనిపించింది. వేడుకల్లో సీతారాముల కల్యాణాన్ని కనులపండవగా చేశారు. చలువ పందిళ్ల కింద జగదానందకారకుడైన శ్రీరాముడు, సీతాదేవిల విగ్రహాలకు వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ కల్యాణ క్రతువు ఘనంగా జరిగింది. ఉత్సవ కమిటీలు పానకాన్ని తయారుచేసి పంపిణీ చేశారు. –సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ
రమణీయం.. సీతారామ కల్యాణం
రమణీయం.. సీతారామ కల్యాణం
రమణీయం.. సీతారామ కల్యాణం
రమణీయం.. సీతారామ కల్యాణం


