రైతుల కంట మున్నీటి ధారలు | - | Sakshi
Sakshi News home page

రైతుల కంట మున్నీటి ధారలు

Apr 3 2025 2:06 PM | Updated on Apr 3 2025 2:06 PM

రైతుల

రైతుల కంట మున్నీటి ధారలు

రైతుల కంట మున్నేటి ధారలు

హద్దులు తెలియడంలేదు

వరదలకు పొలాలు మొత్తం ఇసుక మేట వేశాయి. పొలాలు హద్దులు కూడా కనిపించటం లేదు. మా పొలం నుంచి ఇసుక మేటలు తొలగించాలంటే ఎకరానికి రూ.లక్షలు ఖర్చు అవుతాయని అధికారులే చెబుతున్నారు. పొలాల్లో రెండు అడుగులు పైన ఇసుక మేటలు ఉన్నాయి. మా సోదరికి చెందిన రెండు ఎకరాల్లో ఇసుక మేట అలానే ఉంది.

– ఎం.అశోక్‌, రైతు, ముచ్చింతాల

ఖరీఫ్‌ సాగు ఎలా?

పొలాలు నామరూపాలు లేకుండా పోయాయి. మా 12 ఎకరాల పొలం ఇసుక మేటతో ఎడారిని తలపి స్తోంది. ఖరీఫ్‌లో పొలాల్లో పంటలు సాగు చేసుకునేలా ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి. ఇసుక తొలగించేందుకు ఎకరానికి రూ.3.70 లక్షల ఖర్చవుతుందని అధికారులు చెబుతున్నారు. ఆ లెక్కన మా 12 ఎకరాల్లో ఇసుక తొలగింపునకు సుమారు రూ.36 లక్షల ఖర్చవుతుంది.

–మల్లెంపాటి సతీష్‌, రైతు, ముచ్చింతాల

ప్రత్యేక నిధులు కేటాయించాలి

రైతులు ఖరీఫ్‌ సాగు చేసుకోవాలంటే పొలాల్లో ఇసుక మేటల తొలగింపునకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలి. వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల్లో వందల ఎకరాల్లో ఇసుక పెద్ద ఎత్తున మేట వేసింది. రైతులకు సొంతగా పొలాల్లో మేట వేసిన ఇసుక తీసుకునే ఆర్థిక స్థితి లేదు. ప్రభుత్వం నిధులు విడుదల చేసి ఆదుకోవాలి.

–కనగాల రమేష్‌, నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం అధ్యక్షుడు

పెనుగంచిప్రోలు: మునేరుకు గత ఏడాది సెప్టెంబర్‌లో వచ్చిన భారీ వరదలు పచ్చని పంట పొలా లను ఎడారిగా మార్చి రైతులకు కన్నీరు మిగిల్చాయి. వరదల ధాటికి పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల్లో వందల ఎకరాల్లో పంట కొట్టుకుపోయింది. పచ్చని అందాలు పరిచినట్లుగా ఉండే మాగాణి భూములు ఇసుక మేటలతో ఎడారిగా మారాయి. నీటి ఉధృతికి పొలాల గట్లు కొట్టుకు పోయి హద్దులు కూడా కనిపించటం లేదు. ఇసుక మేటలు తొలగించేందుకు భారీగా ఖర్చవుతుందని, అంత మొత్తం తాము భరించలేమని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఉపాధిహామీ పథకం నిధులతో ఇసుక మేటలు తొలగించే పరిస్థితి లేదని అధికారులు తేల్చిచెప్పారు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. జూన్‌ నెల నుంచి వర్షాలు పడతాయని, అప్పుటికి పొలాల్లో ఇసుక మేటలు తొలగించకపోతే ఖరీఫ్‌ సీజన్‌ సాగు చేపట్టలేమని రైతులు పేర్కొంటున్నారు.

ఏడు నెలలు కావస్తోంది..

మునేరుకు వరదలు వచ్చి పొలాలు ఇసుక మేట వేసి ఏడు నెలలు కావస్తోంది. నేటి వరకు అధికా రులు, ప్రజాప్రతినిధులు ఇసుక మేటల ఊసే ఎత్తడంలేదు. ఒకవేళ తమంతట తాము తొలగించు కుంటామన్నా అధికారులు ఒప్పు కోవటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ నెల 29న కొండపల్లిలో కలెక్టర్‌ లక్ష్మీశ పర్యవేక్షణలో జరిగిన జిల్లా సమీక్ష కమిటీ సమావేశంలో మునేరు వరదలకు 1400 ఎకరాల్లో వేసిన ఇసుక మేటలు తొలగించేందుకు ఎకరానికి రూ.3.70 లక్షల వరకు ఖర్చవుతుందని అధికారులు జిల్లా ఇన్‌చార్జి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఒక్కో ఎకరంలో 400 నుంచి 500 ట్రక్కులు ఇసుక మేట ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. ఇసుక తొలగించిన తరువాత మట్టితో చదును చేయాలని, అప్పుడే సాగుకు భూములు పనికొస్తాయని, ఈ వ్యవహారం తమకు తలకు మించిన భారమని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

వర్షాకాలంలో ఇసుక తొలగించలేరు

వర్షాకాలం వస్తే ఇసుక మేటలు తొలగించే పరిస్థితి ఉండదు. ఈ లోగా రైతులు తమ పొలాల్లోని ఇసుక మేటలు తొలగించుకునే పరిస్థితిలో లేరు. రైతులు రూ.లక్షలు ఖర్చు పెట్టి ఇసుక తొలగించాలంటే ఖరీఫ్‌ సీజన్‌ వెళ్లిపోతుంది. తమ దయనీయ స్థితిని ప్రభుత్వం అర్థం చేసుకుని రెండు నెలల్లో ఇసుక మేటలు తొలగింపునకు ప్రత్యేక నిధులు కేటాయించాలని రైతులు ముక్తకంఠంతో కోరుతున్నారు. గత ప్రభుత్వంలో రైతులకు అంతా మంచి జరిగిందని, మునేరుకు గండ్లు పడితే యుద్ధ ప్రాతిపదికన పూడ్చారని గుర్తుచేస్తున్నారు. మునేరు వరదకు గండ్లు పడటంతో పాటు పక్కన ఉన్న పొలాలు ఇసుక మేట వేయటంతో పాటు కోతకు గురయ్యాయన్నారు. అయినా నేటి వరకు గండ్లు పూడ్చేందుకు అంచనాలు అంటున్నారే తప్ప సమస్య పరిష్కారం కావటం లేదని వాపోతున్నారు.

ఎడారిలా మారిన పంట పొలాలు

మునేరు వరదతో పొలాల్లో భారీగా ఇసుక మేటలు ఇసుక మేటలతో రూపుకోల్పోయిన 1400 ఎకరాలు ఇసుక తొలగింపునకు ఎకరానికి రూ.3.7 లక్షల ఖర్చవుతుందని అంచనా తక్షణం నిధులు విడుదల చేయాలని కోరుతున్న బాధిత రైతులు

రైతుల కంట మున్నీటి ధారలు1
1/5

రైతుల కంట మున్నీటి ధారలు

రైతుల కంట మున్నీటి ధారలు2
2/5

రైతుల కంట మున్నీటి ధారలు

రైతుల కంట మున్నీటి ధారలు3
3/5

రైతుల కంట మున్నీటి ధారలు

రైతుల కంట మున్నీటి ధారలు4
4/5

రైతుల కంట మున్నీటి ధారలు

రైతుల కంట మున్నీటి ధారలు5
5/5

రైతుల కంట మున్నీటి ధారలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement