దుర్గమ్మకు పోలీసుల ప్రత్యేక పూజలు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఉగాది పర్వదినం సందర్భంగా వెండిరథంపై ఊరేగిన దుర్గమ్మకు పోలీసు శాఖ పక్షాన ఆదివారం రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉగాది పర్వదినం రోజు శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం నిర్వహించే వెండి రథోత్సవం పాతబస్తీ వీధుల్లో ఊరేగుతూ తిరుగు ప్రయాణంలో వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు చేరుకుంది. అక్కడ పోలీసు శాఖ పక్షాన సీపీ ఎస్వీ రాజశేఖర్‌బాబు దంపతులు, స్థానిక స్టేషన్ హౌస్ ఆఫీసర్ సీఐ గురుప్రకాష్,, ఏసీపీ దుర్గారావు, ఇతర అధికారులు పూజలు నిర్వహించి స్టేషన్ ప్రాంగణంలోకి తీసుకువచ్చారు. అనంతరం పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అధికారులు గౌతమిశాలి, గుణ్ణం రామకృష్ణ, ఎం. కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. అలాగే ఏసీపీ దుర్గారావు, సీఐ గురుప్రకాష్‌లో సీపీ దంపతులను జ్ఞాపికతో సత్కరించారు.
విజయవాడ వన్‌టౌన్ పీఎస్ వద్ద
పండుగ వాతావరణం
దుర్గమ్మకు పోలీసుల ప్రత్యేక పూజలు


