దీర్ఘకాలిక రోగులను ‘స్పాట్‌’ నుంచి మినహాయించాలి | - | Sakshi
Sakshi News home page

దీర్ఘకాలిక రోగులను ‘స్పాట్‌’ నుంచి మినహాయించాలి

Mar 21 2025 2:08 AM | Updated on Mar 21 2025 2:03 AM

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): త్వరలో జరిగే పదో తరగతి స్పాట్‌ వాల్యూయేషన్‌ విధుల నుంచి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని మినహాయించాలని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, ఎ.సుందరయ్య కోరారు. ఈ మేరకు డీఈఓ కార్యాలయంలో ఎన్టీఆర్‌ జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి యు.వి.సుబ్బారావును కలిసి గురువారం వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దీర్ఘకాలిక జబ్బులు, సుదూర ప్రాంతాల వారు, 60 ఏళ్లు నిండిన, గర్భిణులు, దివ్యాంగులు, బాలింతలను స్పాట్‌ విధుల నుంచి మినహాయించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ విద్యాసంస్థల్లో రివర్షన్‌కు గురైన ఉపాధ్యాయుల జీతాలు, ఇతర సమస్యలు గురించి నాయకులకు డీఈఓకు వినతిపత్రాన్ని అందించారు. వీటిపై పరిశీలించి ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని డీఈఓ సుబ్బారావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎ.గోపాలకృష్ణ, వి.కొండలరావు, ఎం.శ్రీనివాసరావు, ఎస్‌.చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement