విజయవాడస్పోర్ట్స్: ప్రజాసేవలో తలమునకలయ్యే ప్రజాప్రతినిధులకు ఉపశమనం కలిగించేలా ప్రభుత్వం తలపెట్టిన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యుల క్రీడలను సమర్థంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు అంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ(శాప్) చైర్మన్ అనిమిని రవినాయుడు తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ నెల 18న ఈ పోటీలు ప్రారంభమవుతాయని, రెండు రోజుల పాటు ఈ పోటీలు జరుగుతాయని వెల్లడించారు. పోటీలకు ఏర్పాట్లను ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, బొజ్జల సుధీర్‌రెడ్డి, సుందరపు విజయ్‌కుమార్, పీవీజీఆర్ నాయుడు (గణబాబు), ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పంచుమర్తి అనురాధ, శాప్ పరిపాలన అధికారి రమావత్ వెంకటరమణనాయక్‌తో కలిసి సోమవారం పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల క్రీడా సంబరాల్లో 13 క్రీడలను నిర్వహించనున్నామని, మంగళవారం మధ్యాహ్నం క్రీడాశాఖామంత్రి, స్పీకర్ కలిసి క్రీడలను ప్రారంభిస్తారన్నారు. 20వ తేదీన క్రీడలు ముసిగిన తర్వాత గెలుపొందినవారికి బహుమతులు ప్రదానం చేస్తారన్నారు.
శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు