నందిగామ: జాతీయ స్థాయిలో జరిగిన స్విమ్మింగ్ పోటీల్లో నందిగామకు చెందిన ఓ చిన్నారి రెండు సిల్వర్ మెడల్స్ దక్కించుకున్నాడు. ఎస్‌బీకేఎఫ్ సంస్థ ఆధ్వర్యాన 8వ నేషనల్ గేమ్స్ 2023 దేశ రాజధాని ఢిల్లీలో మే 28న జరిగాయి. పోటీల్లో నందిగామకు చెందిన వెలిశెట్టి నాగార్జున అండర్ 14 విభాగంలో పాల్గొన్నారు. 25 మీటర్ల స్విమ్మింగ్‌లో నిర్వహించిన రెండు విభాగాల్లో సిల్వర్ మెడల్స్ దక్కించుకున్నాడు. నాగార్జున పట్టణంలోని శ్రీ విద్యా పాఠశాలలో ఆరో తరగతి పూర్తి చేశాడు. ఆరు నెలలుగా స్విమ్మింగ్‌లో ప్రత్యేక శిక్షణ పొందా డని నాగార్జున తండ్రి సురేష్ తెలిపారు. రెండు వెండి పతకాలు సాధించిన నాగార్జునను గురువారం పాఠశాల యాజమా న్యంతో పాటు పలువురు అభినందించారు.


