హాంకాంగ్ లో ఘనంగా ఉగాది వేడుకలు.. | Ugadi Festival Celebrated Hong Kong | Sakshi
Sakshi News home page

హాంగ్‌కాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు..

May 20 2024 1:30 PM | Updated on May 20 2024 1:30 PM

Ugadi Festival Celebrated Hong Kong

హాంగ్‌కాంగ్‌లో తెలుగు వారంతా కలిసి ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు, కొత్త స్నేహితులతో ఉల్లాసంగా సాగిన ఈ కార్యక్రమానికి స్థానిక ప్రముఖులు, శ్రీ కే. వెంకట రమణ గారుకాన్సల్, కన్సుల్టే జనరల్ అఫ్ ఇండియా,హాంగ్ కాంగ్ మరియు మకావ్; మాస్.ఏమి యుంగ్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ (ఐలాండ్స్), హాంగ్ కాంగ్ హోమ్ అఫైర్స్ డిపార్ట్మెంట్; శ్రీ. లాల్ హర్దసాని ప్రెసిడెంట్, ది హిందూ అసోసియేషన్; ఉస్తాద్ గులాం సిరాజ్, చైర్మన్, పుంహక మరియు శ్రీ. కె. వెంకట వంశీధర్, రీజినల్ హెడ్,స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా, ముఖ్య అతిధులుగా విచ్చేసారు. శ్రీ వెంకట రమణ గారు దీప ప్రజ్వలన చేయగా, ఇతర ముఖ్య అతిధులు కూడా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. 

తదనంతరం శ్రీ వెంకట రమణ గారు,హాంగ్ కాంగ్ లో తెలుగు వారు సమాఖ్య ద్వారా చేస్తున్న భాష సేవ  సాంస్కృతిక పరిరక్షణను కొనియాడారు. తదనంతరం శంకరంబాడి సుందరాచారి గారి రచన ‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ‘ గానంతో ప్రారంభైన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. కూచిపూడి, భరతనాట్యం వంటి సాంప్రదాయ నృత్యాలు, ఫ్లూట్ మరియు యుకెలేలే వాయిద్యాలపై టాలీవుడ్ పాటలు, ఫ్యూజన్ డ్యాన్స్, పాత క్లాసిక్ మెడ్లీలకు నృత్యం వంటి విభిన్నమైన ఆట పాటలతో మరియు హాస్య నాటిక తో కార్యక్రమం ఆసాంతం ఆకట్టుకుంది. గౌరవనీయ అతిధులు కాన్సల్ శ్రీ వెంకట రమణ గారు మరియు మిస్ మాస్.ఏమి యుంగ్ సమాఖ్య లోని స్వచ్చంద సేవకులకు, తెలుగు బడి గురువులకు, స్థానికంగా జరిగే జాతీయ అంతర్జాతీయ మారథాన్లలో మరియు ఆక్స్‌ఫామ్ ట్రయిల్ వాకర్ లో పాల్గొని విజయవంతంగా పూర్తి చేసిన వారి ప్రతిభ గుర్తిస్తూ వారికి మొమెంటోలు అందించారు.

 సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి జయ పీసపాటి కార్యక్రమ వివరాలిస్తూ, హాంగ్ కాంగ్ లో నివసిస్తున్న తెలుగు వారు సంప్రదాయ వస్త్రధారణతో హాజరైన సభ్యులతో తెలుగుతనం వెల్లివిరిసిన ఈ వేడుకలతో తెలుగు నేలను మరిపించిందని హర్షం తెలిపారు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరం కనుక ఇక్కడ తమకి ఇక్కడ పెద్ద హాల్ల్స్ అందుబాటులో ఉండవని, ప్రభుత్వ వసతులు లభ్యమైనప్పుడు వేడుకలు చేసుకుంటున్నామని, అందుకీ ఉగాది వేడుకలు చేసుకోవడం కొంత ఆలస్యంయ్యిందని వివరించారు .జూన్ లో తమ సంస్థ క్రీడా దినోత్సవానికి సిద్ధమవుతున్నామని చెప్పారు. 

సమాఖ్య కార్యవర్గ సభ్యులు జయ పీసపాటి, రాజశేఖర్ మన్నే,రమేష్ రేణిగుంట్ల, హరీన్ తుమ్మల, రమాదేవి సారంగా, మాధురి కొండా మరియు ఇతర సభ్యులు అపర్ణ కంద, రాధికా సంబతూర్, ప్రత్యుష – రవికాంత్ గునిశెట్టి, కల్పన – జయసురేష్ మట్టపర్తి, ప్రియాంక – బాబీ సత్తినేని, కృష్ణ ప్రసాద్ రెడ్డి, భరత్ కోరాడ, ధర్మ రాజు దుంప, సుగుణ రవి, మానస గర్దాస్, శాంతి పలుకూరి తదితరులు ఉగాది వేడుకల నిర్వాహణలో ఉత్సాహంగా పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement