తానా మాజీ అధ్యక్షుడు డాక్టర్ రవీందర్‌రావు మృతి

తానా మాజీ అధ్యక్షుడు డాక్టర్ రవీందర్‌రావు శుక్రవారం ఉదయం యశోద ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన వృద్ధాప్యంతో పాటు కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఆయన హాస్పిటల్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా సేవలు అందించారు.
ఆయన మృతి ఇటు వైద్య రంగానికి అటు తానా కు తీరని లోటని ఐఎంఏ తెలంగాణ స్టేట్ అధ్యక్షుడు డాక్టర్ బీఎన్‌రావు సహా తానా అధ్యక్షుడు డాక్టర్ పి.రమణ సంయుక్తంగా విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మృతికి సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు.
మరిన్ని వార్తలు :