శివపదం గీతాలకు ఇండోనేషియా బాలిలో నృత్య ప్రదర్శన

Indian Classical Dance Performance In Bali Indonesia - Sakshi

శివపదం గ్లోబల్‌ ఫ్యామిలి భారతీయ నృత్య ప్రదర్శనకు సరిహద్దులు లేవని చాటిచెప్పారు. అమెరికాలో పుట్టి పెరిగిన 45 మంది భారతీయ విద్యార్థులు ఇండోనేషియా బాలిలో కూచిపూడి, భరతనాట్యం, కథక్‌, ఒడిస్సీ వంటి సంప్రదాయ నృత్యాలతో ఆకట్టుకున్నారు. శివపదం గీతాలకు వాణి గుండ్లాపల్లి (నో యువర్ రూట్స్, యూ. ఎస్. ఏ.), దినేష్ కుమార్ (సంగమం అకాడమీ, ఇండియా) నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది.

డా.సామవేదం షణ్ముఖ శర్మ రచించిన శివపదం సాహిత్య పద్యాలతో పాటు త్యాగరాజు, అన్నమయ్య, మైసూర్ వాసుదేవాచార్యులు రచించిన సాహిత్యాలకు నృత్య ప్రదర్శన చేశారు. అలాగే శివాష్టకం, దుర్గా దేవిస్తోత్రం వంటి వేద స్తోత్రాలను అనేక నృత్య కళారూపాలలో ప్రదర్శించారు.మైత్రీమ్ భజత అనే గీతాన్ని కూడా అందమైన నృత్య రూపంతో ప్రదర్శించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా నవీన్ మేఘ్వాల్ (బాలిలోని ఐ.సి.సి.ఆర్ – ఎస్.వి.సి.సి డైరెక్టర్), డైరెక్టర్: ప్రొఫెసర్ డా. ఐ వాయన్ అద్న్యానా ఇసి, డెన్‌పాసర్‌లతో పాటు పలువురు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కళలకు ఎల్లలు లేవని చాటిచెప్పడానికే ఈ ప్రదర్శన ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top