టాంటెక్స్‌ నూతన కార్యవర్గం ఎన్నిక | Sakshi
Sakshi News home page

టాంటెక్స్‌ నూతన కార్యవర్గం ఎన్నిక

Published Wed, Jan 19 2022 9:33 AM

Details About Newly Elected TANTEX New Executive Body - Sakshi

డల్లాస్‌: ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షుడిగా ఉమామహేశ్‌ పార్నపల్లి ఎన్నికయ్యారు.  2022 సంవత్సరానికి సంబంధించి నూతన కార్యవర్గాన్ని జనవరి 9న డాలస్లో జరిగిన గవర్నింగ్ బోర్డు సమావేశంలో  ప్రకటించారు. ఈ సందర్భంగా ఉమామహేష్ పార్నపల్లి సంస్థ అధ్యక్షుడుగా  పదవీబాధ్యతలు స్వీకరించారు.

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) లాంటి గొప్ప సంస్థ కి  అధ్యక్షుడుగా పదవీబాధ్యతలు తీసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆయన చెప్పారు. ఉత్తర అమెరికా లోనే ప్రతిష్టాత్మక సంస్థ అయిన టాంటెక్స్‌ను ముందుండి నడపవలసిన బాధ్యతను తన మీద పెట్టినందుకు సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ ప్రమాణాలను మరింత పెంచే దిశగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఇందుకు కార్య నిర్వాహక బృందము, పాలక మండలిల నుంచి పూర్తి సహకారాన్ని ఆశిస్తున్నానట్లు చెప్పారు. 

2021 సంవత్సరంలో టాంటెక్స్ అధ్యక్షురాలుగా పని చేసి,  పదవీ విరమణ చేస్తున్న తక్షణ పూర్వాధ్యక్షులు  లక్ష్మీ అన్నపూర్ణ పాలేటి మాట్లాడుతూ  ఉమా మహేష్ పార్నపల్లి గారి నేతృత్వంలో ఏర్పడిన 2022 కార్యవర్గ బృందం నిర్వహించబోయే కార్యక్రమాలకు  సంపూర్ణ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాను అని తెలిపారు. 

 అధికారిక కార్యనిర్వాహక బృందం
నూతనంగా ఎన్నికైన టాంట్సాక్స్‌ కార్యనిర్వాహక బృందం వివరాలు ఇలా ఉన్నాయి.. ఉమామహేష్ పార్నపల్లి (అధ్యక్షుడు) ,  ఉదయ్ కిరణ్ నిడిగంటి (సంయుక్త కార్యదర్శి),  శరత్ రెడ్డి ఎర్రం (ఉత్తరాధ్యక్షుడు), సుబ్బారెడ్డి కొండు (కోశాధికారి), సతీష్ బండారు (ఉపాధ్యక్షులు) , భాను ప్రకాష్ వెనిగళ్ల (సంయుక్త కోశాధికారి), సురేష్ పఠనేని (కార్యదర్శి), లక్ష్మీ అన్నపూర్ణ పాలేటి (తక్షణ పూర్వాధ్యక్షులు) ఇతర సభ్యులుగా సరిత ఈదర, స్రవంతి యర్రమనేని,  కళ్యాణి తాడిమేటి, మాధవి లోకిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి పొట్టిపాటి, రఘునాథ రెడ్డి కుమ్మెత, నాగరాజు చల్లా, శ్రీనివాసులు బసాబత్తిన, శ్రీనివాస పాతపాటి, కృష్ణా రెడ్డి మాడ, రాజా మాగంటి, విజయ్ సునీల్ సూరపరాజులు ఉన్నారు. టాంటెక్స్‌ పాలక మండలిలో అధిపతిగా వెంకట్ ములుకుట్ల,  ఉపాధిపతిగా అనంత్ మల్లవరపులతో పాటు డాక్టర్ భాస్కర్ రెడ్డి సానికొమ్ము,  గీతా దమ్మన్న, శ్రీ లక్ష్మి మండిగ, శ్రీకాంత్ పోలవరపు, డాక్టర్ వెంకటసుబ్బరాయ చౌదరి ఆచంటలు సభ్యులగా ఉన్నారు. 
 

Advertisement
Advertisement