సింగపూర్‌లో బతుకమ్మ సంబరాలు

Bathukamma Celebrations In Singapore - Sakshi

తెలుగు సమాజం ఆధ్వర్యంలో సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. తెలంగాణ ఫ్రెండ్స్,  టాస్-మనం తెలుగు, మగువ మనసులు ఈ వేడుకల్లో భాగస్వామ్యం అయ్యారు. ఈ  పండుగను సింగపూర్ తెలుగు సమాజం గత 13 సంవత్సరాలుగా  దిగ్విజయంగా నిర్వహిస్తోంది.

కోవిడ్‌ నేపథ్యంలో ఈసారి బతుకమ్మ వేడుకలను వర్చువల్‌గా నిర్వహించారు.  ఐనప్పటికీ అధిక సంఖ్యలో తెలుగింటి ఆడపడుచులు సింగపూర్ నలువైపులా నుంచి ఆటపాటలతో , కోలాటాల విన్యాసాలతో  బతుకమ్మ సంబరాలలో ఆనందంగా పాల్గొన్నారు. తీరొక్క పూలతో అనేక రంగురంగులతో తీర్చిదిద్దిన బతుకమ్మలు అందరినీ అలరించాయి. 

ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా హాజరైన మిస్ యూనివర్స్ సింగపూర్ 2021 నందిత బన్న మాట్లాడుతూ... కరోనా పరిస్థితుల్లో కూడా సింగపూర్‌లోని తెలుగు వారు  ఇంత పెద్ద ఎత్తున ఈ పండగ జరుపుకోవడం తనకెంతో ఆనందంగా ఉందని తెలిపారు. మధుప్రియ పాడిన బతుకమ్మ పాటలు మహిళలకు ఉత్సాహానిచ్చాయి.

సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి గారు మాట్లాడుతూ.. ఘనమైన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీక అన్నారు. టాస్ - మనం తెలుగు తరుపున అనితా రెడ్డి గారు మాట్లాడుతూ.. ప్రాంతాలు , మాండలికాలు వేరైనా తెలుగు వారందరూ కలసికట్టుగా బతుకమ్మ జరుపుకుంటున్నట్టు వెల్లడించారు.  ఆన్‌లైన్‌ ద్వారా ప్రసారం చేసిన ఈ కార్యక్రమంలో సుమారు 10,000 మందికి పైగా పాల్గొన్నట్టు కార్యక్రమ నిర్వాహకులు శ్రీనివాస్ రెడ్డి పుల్లన్నగారి తెలిపారు. 
 

చదవండి :లండన్‌లో కన్నులపండువగా బతుకమ్మ వేడుకలు

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top