ఇండియన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో అజాదీ కా అమృతోత్సవ్ | Azadi Ka Amrut Mahotsav Program In America | Sakshi
Sakshi News home page

ఇండియన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో అజాదీ కా అమృతోత్సవ్

Aug 18 2021 8:38 PM | Updated on Aug 18 2021 8:38 PM

Azadi Ka Amrut Mahotsav Program In America - Sakshi

అట్లాంటా: ఆగస్ట్ 15న ఇండియన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో అట్లాంటాలో భారతీయ 75వ స్వాతంత్య్ర వేడుకలు జరిగాయి. అజాదీ కా అమృతోత్సవ్ పేరిట జరిగిన ఈ వేడుకలకు నాట్స్ ను కూడా భారతీయ దౌత్య కార్యాలయం ఆహ్వానించింది.. నాట్స్ తరపున నాట్స్ బోర్డ్ డైరెక్టర్ ప్రశాంత్ పిన్నమనేని అజాదీ కా అమృతోత్సవ్‌లో పాల్గొన్నారు. అట్లాంటాలో నాట్స్ తెలుగువారి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది.

భారతీయుల వీసా, ఇమిగ్రేషన్‌తో పాటు అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న నాట్స్ ను భారతీయ కాన్సులేట్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించింది. భారతీయ కాన్సులేట్ అట్లాంటాలో నాట్స్ ను గౌరవించడం.. నాట్స్ విన్నపాలను ఎప్పటికప్పుడు పరిశీలించి మద్దతు ఇవ్వడం పట్ల నాట్స్ బోర్డ్ డైరెక్టర్ ప్రశాంత్ పిన్నమనేని కాన్సులేట్ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అజాదీ కా అమృతోత్సవ్ కార్యక్రమాన్ని ట్విటర్లో కూడా షేర్ చేసి ప్రవాస భారతీయులంతా దేశభక్తిని చాటుతున్నారనే విషయాన్ని కాన్సులేట్ స్పష్టం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement