All set for ATA Conference 2022: Guests Arriving to Washington DC - Sakshi
Sakshi News home page

ATA Conference 2022: ఆటా వేడుకలకు సర్వ సిద్ధం: అతిథులతో కళకళ లాడుతున్న వేదిక

Jun 30 2022 10:26 AM | Updated on Jun 30 2022 11:39 AM

All set for ATA Conference 2022:Guests Arriving to Washington Dc - Sakshi

వాషింగ్టన్‌: అమెరికా తెలుగు సంఘం (ఆటా)17వ ఆటా మహసభలకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.  జూలై 1 నుంచి 3వ తేదీ వరకు వాల్టర్‌ ఇ వాషింగ్టన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో  అంగరంగ వైభంగా జరిగే ఈ వేడుకలకోసం తెలుగువారంతా అమెరికాకు చేరుకుంటున్నారు. 

పదివేలమందికిపైగా హాజరవుతారని భావిస్తున్న ఆటా మహాసభలకు పలువురు రాజకీయ, సినీ రంగ ప్రముఖులు ఒక్కొక్కరుగా వాషింగ్టన్‌ డీసీకి చేరుకుంటున్నారు. ముఖ‍్యంగా టాలీవుడ్‌ ప్రముఖులు తమన్, చంద్రబోస్, శివారెడ్డి ,  సింగర్‌ మంగ్లీ  తదితరులు ఏటీఏ కాన్ఫరెన్స్‌కు చేరుకున్నారు. 

మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో  ప్రత్యేక కార్యక్రమాలు అలరించనున్నాయి. ఆటా అధ్యక్షుడు భువనేష్‌ భుజాల సారథ్యంలో వేర్వేరు కమిటీలు వేడుకలకు సంబంధించి  అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.  మరికొన్ని గంటల్లో  ప్రారంభంకానున్న  వేడుకల కోసం అంతా వేయి కళ్లతో  ఎదురు చూస్తున్నారు. కాగా కోవిడ్‌ కారణంగా రెండేళ్ళలో వేడుకలు ఇంత పెద్ద ఎత్తున జరగకపోవడం, కోవిడ్‌ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో మరింత ఉత్సాహం నెలకొంది. ఎలాంటి ఆటంకం లేకుండా సజావుగా, ఉత్సాహంగా సభలను నిర్వహించేందుకు ఎద్ద ఎత్తున ఏర్పాట్లు చేశామని ఆటా అధ్యక్షుడు తెలిపారు. 

 -వాషింగ్టన్‌ డీసీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి

Advertisement
 
Advertisement
Advertisement