రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్‌ నిధులు | - | Sakshi
Sakshi News home page

రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్‌ నిధులు

Nov 6 2026 2:02 AM | Updated on Nov 6 2026 2:02 AM

విచారణ వాయిదా! ఫార్మ కంపెనీలో పేలిన రియాక్టర్‌

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): కేంద్రం ప్రభుత్వం 24 వ విడత పీఎం కిసాన్‌ డబ్బులు విడుదల చే సింది. బ్యాంకు ఖాతాల్లో నిధులు జమవుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నా రు. అయితే జిల్లా వ్యాప్తంగా ఎంత మంది రై తులకు పీఎం కిసాన్‌ నిధులు జమయ్యాయ నే వివరాలు వ్యవసాయ శాఖకు అందలేదు. పోయినసారి 86,377మంది రైతులకు రూ. 2వేల చొప్పున జమకాగా, 24వ విడతలో అ నర్హులను తొలగించినట్లుగా చెబుతున్న అ ధికారులు.. లబ్ధిదారుల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతా రావ్‌ల మధ్య ఇటీవల ఢిల్లీలో జరిగిన గొడవకు సంబంధించి గురువారం గాంధీభవన్‌కు రావాలని పీసీసీ నుంచి పిలుపు వచ్చింది. తొలుత మంత్రితో, తర్వాత ఎమ్మెల్యేతో మాట్లాడాలని నిర్ణయించగా, మంత్రి హాజరుకాలేదని సమాచారం. జుక్కల్‌ ఎమ్మెల్యే సైతం గాంధీభవన్‌కు వెళ్లలేదని తెలుస్తోంది. దీంతో విచారణ వాయిదాపడినట్లు భావిస్తున్నారు. వివాదం పీసీసీ స్థాయిలో పరిష్కారమవుతుందా లేదా ఏఐసీసీ దగ్గరకు వెళుతుందా అన్నది తేలాల్సి ఉంది.

● ఐదుగురికి తీవ్రగాయాలు

భిక్కనూరు: భిక్కనూరు మండల సమీపంలో ఉన్న ఓ ఫార్మ కంపెనీ రియాక్టర్‌ పేలడంతో గురువారం రాత్రి ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ముగ్గురు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కాగా, మరో ఇద్దరు స్థానికులు అని తెలిసింది. గాయపడిన ఐదుగురిని ఫ్యాక్టరీ అధికారులు వెంటనే అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. ఈ విషయమై భిక్కనూరు పోలీసులను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.

మెడికల్‌ కళాశాలకు

అదనంగా17 పీజీ సీట్లు

నిజామాబాద్‌ అర్బన్‌ : ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు అదనంగా 17 పీజీ సీట్లు మంజూరు చేస్తూ నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. కమ్యూనిటీ మెడిసిన్‌ విభాగంలో నాలుగు, మత్తుమందు వైద్యుల విభాగంలో ఆరు, పాథాలజీలో నాలుగు, ప్రసూతి విభాగంలో మూడు సీట్లను మంజూరు చేశారు. ఇప్పటికే ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో 81 ిపీజీ సీట్లు ఉండగా.. అదనంగా 17 మంజూరు కావడంతో మొత్తం 98 సీట్లు అందుబాటులోకి వచ్చాయి.

24వ రోజుకు చేరిన సమ్మె

నిజామాబాద్‌ అర్బన్‌ : వైద్యారోగ్యశాఖలోని నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ఉద్యోగుల సమ్మె గురువారం నాటికి 24వ రోజుకు చేరింది. నిరసన లో భాగంగా ధర్నా చౌక్‌లో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం చె ల్లించాలని ఉద్యోగులు కోరారు. ఉద్యోగ జే ఏసీ నాయకులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీలకు ఎంపిక

నందిపేట్‌(ఆర్మూర్‌) : మండల కేంద్రంలోని గీతా కాన్వెంట్‌ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న రెంజర్ల శ్రీవల్లి రాష్ట్రస్థాయి వాలీబాల్‌ టోర్నీకి ఎంపికై ంది. ఈ నెల 4వ తేదీన జిల్లా కేంద్రంలోని డీఎస్‌ఏ మైదానంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా ఎంపిక పోటీల్లో శ్రీవల్లి ఉత్తమ ప్రతిభకనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికై ంది. ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న 70వ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్రస్థాయి అండర్‌–17 పోటీల్లో రెంజర్ల శ్రీవల్లి పాల్గొంటోందని పాఠశాల కరస్పాండెంట్‌ గంగాసాగర్‌ తెలిపారు. స్కూల్‌ డైరెక్టర్‌ శోభ, హెచ్‌ఎం గంగాభూషణ్‌, పీఈటీలు ముత్యం, మర్రిపల్లి సుమలత, ఉపాధ్యాయుడు జె చిన్నయ్య శ్రీవల్లిని అభినందించారు.

హుండీ ఆదాయం లెక్కింపు

నిజామాబాద్‌ రూరల్‌: నగరంలోని శంభు లింగేశ్వరస్వామి దేవస్థానం హుండీ ఆదా యాన్ని దేవాదాయశాఖ పరిశీలకురాలు ఆర్‌ సుజాతారెడ్డి సమక్షంలో గురువారం లెక్కించారు. రూ.1,18,729 ఆదాయం వచ్చినట్లు ఆమె తెలిపారు. ఆలయ ఈవో రాములు, అ ర్చకులు రాజుకిరణ్‌, జూనియర్‌ సహాయకు లు కిశోర్‌, భక్త పారాయణ బృందం సభ్యు లు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement