భూభారతి రీసర్వేను పరిశీలించిన సబ్‌ కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

భూభారతి రీసర్వేను పరిశీలించిన సబ్‌ కలెక్టర్‌

Nov 5 2026 2:10 AM | Updated on Nov 5 2026 2:10 AM

వేల్పూర్‌(ముప్కాల్‌)/కమ్మర్‌పల్లి(మోర్తాడ్‌): ముప్కాల్‌ మండలం నల్లూర్‌, ఏర్గట్ట మండలం తొర్తిలో కొనసాగుతున్న భూ భారతి రీ సర్వేను ఆర్మూర్‌ సబ్‌ కలెక్టర్‌ అభిజ్ఞాన్‌ మాల్వియా బుధవారం పరిశీలించారు. రైతులకు ముందస్తు సమాచారం ఇచ్చి సర్వేను పారదర్శకంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. మొత్తం భూమి, ఇంతవరకు ఎంత భూమి రీ సర్వే పూర్తయ్యిందని తెలుసుకున్నారు. సర్వే సమయంలో రైతు లు, భూయజమానులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని అన్నారు. భూముల వి వరాలు క్షుణ్ణంగా పరిశీలించి, ఎలాంటి త ప్పులు లేకుండా నమోదు చేయాలని సూ చించారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఆయన వెంట రెవెన్యూ అధికారులు, సర్వే సిబ్బంది ఉన్నారు.

డీసీఎంఎస్‌ ఇన్‌చార్జి చైర్మన్‌గా రాజాగౌడ్‌

సుభాష్‌నగర్‌: జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌) ఇన్‌చార్జి చైర్మన్‌గా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) రాజాగౌడ్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. డీసీఎంఎస్‌ కార్యాలయానికి వచ్చిన ఆయనకు సంబంధిత అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ రైతులకు సహకార రంగం ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని అదనపు కలెక్టర్‌ వారికి సూచించారు. డీసీఎంఎస్‌ మేనేజర్‌ నగేశ్‌, సిబ్బంది ఆరెట్టి ఆనంద్‌ పాల్గొన్నారు.

డబుల్‌ ఇళ్ల పనులను పూర్తి చేయాలి

మోపాల్‌: మండలంలోని న్యాల్‌కల్‌లో అసంపూర్తిగా ఉన్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని డీఆర్‌వో, హౌజింగ్‌ పీడీ గీత ఆదేశించారు. న్యాల్‌కల్‌ గ్రామాన్ని బుధవారం సందర్శించిన డీఆర్‌వో.. అసంపూర్తిగా నిలిచిపోయిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను పరిశీలించి కాంట్రాక్టర్‌ను పిలిపించారు. వీలైనంత త్వరగా పనులను ప్రారంభించి పూర్తి చేయాలని, లేనిపక్షంలో తప్పుకోవాలని కాంట్రాక్టర్‌కు సూ చించారు. ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల అంశంపై సీరియస్‌గా ఉందన్నారు. 36 ఇళ్ల పనులకుగాను 26 ఇళ్ల స్లాబ్‌ పనులు పూర్తయ్యాయని, నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. ఆమె వెంట సర్పంచ్‌ చంద్రకళ గంగాప్రసాద్‌, డీఈ రాజ్యలక్ష్మి, ఎంపీవో కిరణ్‌కుమార్‌, ఏఈ స్వాతి, కార్యదర్శి జయ శ్రీ, తదితరులు ఉన్నారు.

పేకాట స్థావరాల

సమాచారం అందించాలి

నిజామాబాద్‌అర్బన్‌: పేకాటపై పూర్తిగా నిషేధం ఉందని, దీపావళి నేపథ్యంలో ఎక్కడైనా పేకాట స్థావరాలు కొనసాగితే తమకు సమాచారం అందించాలని సీపీ సాయిచైతన్య బుధవారం ఒక ప్రకటనలో కోరారు. పేకాట ఆడినా, పేకాటస్థావరాలు నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పండుగ నేపథ్యంలో కమిషనరేట్‌ పరిధిలో స్పెషల్‌ టీములు, పటిష్టమైన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పేకాట స్థావరాల సమాచారాన్ని పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ 87126 59700 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.

ఏపీకే ఫైల్‌ క్లిక్‌..

రూ.5 లక్షలు మాయం

ఆర్మూర్‌టౌన్‌: ఆర్టీఏ చలాన్‌ పేరుతో వచ్చిన ఏపీకే ఫైల్‌ను క్లిక్‌ చేయడంతో ఆలూర్‌ గ్రా మానికి చెందిన పెండ అంబేడ్కర్‌ అనే వ్యక్తి బ్యాంక్‌ ఖాతా నుంచి రూ.5 లక్షలు మాయమైనట్లు ఆరూ్‌మ్‌ర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో చంద్రశేఖర్‌రెడ్డి బుధవారం తెలిపారు. సైబర్‌నేరగాళ్లు ఆర్టీఏ చలాన్‌ పేరుతో ఏపీకే ఫైల్‌ పంపగా.. తన పేరుతో ఎన్ని చలాన్‌లు ఉన్నాయని తెలుసుకునేందుకు అంబేడ్కర్‌ ఫైల్‌ను క్లిక్‌ చేశాడని, కొంతసేపటికే బ్యాంక్‌ ఖాతా నుంచి దశల వారీగా రూ.5 లక్షలు వి త్‌ డ్రా అయినట్లు మెస్సేజ్‌లు వచ్చాయన్నా రు. ఆందోళనకు గురైన బాధితుడు బ్యాంకుకు వెళ్లి విచారించగా డబ్బులు విత్‌ డ్రా అయినట్లు తెలిసిందన్నారు. సైబర్‌ నేరగాళ్ల చేతుల్లో మోసపోయిన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఎస్‌హెచ్‌వో సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement