● నగదు, సొత్తు స్వాధీనం
● వివరాలు వెల్లడించిన సీపీ సాయిచైతన్య
నిజామాబాద్‌అర్బన్: పగటిపూట ఇళ్లలో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ము ఠాను అరెస్టు చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. కమిషనరేట్ కార్యాలయంలో మీ డియాకు బుధవారం వివరాలు వెల్లడించారు. మ హారాష్ట్ర చెందిన సయ్యద్ షకీల్, షేక్ అహ్మద్, షేక్ ఇమ్రాన్ ముఠాగా ఏర్పడి అక్టోబర్ 4వ తేదీన నవీపేట మండల కేంద్రానికి చెందిన మహమ్మద్ నవీదుద్దీన్ అనే వ్యక్తి ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. మధ్యాహ్నం వేల ఇంటి తాళాన్ని పగులగొట్టి చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసుకున్న పోలీసులు ఏసీపీ ప్రకాశ్ యా దవ్, ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. చోరీకి పాల్పడిన వారిని బుధవారం నవీపేట సమీపంలో పట్టుకున్నారు. నిందితులు నిజామాబాద్‌తోపాటు కామారెడ్డి, నిర్మల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో చోరీలకు పాల్పడిన ట్లు సీపీ తెలిపారు. కర్నాటకలోని యాద్గిర్ పట్టణ ప్రాంతంలో కూడా వీరిపై చోరీ కేసులు ఉన్నా యన్నారు. ముఠాలోని ప్రధాన నిందితుడు సయ్య ద్ షకిల్ హోండా సిటీ కారు తీసుకొని దానికి నకిలీ నంబర్ పేట్లను తయారు చేసి చోరీలకు పాల్పడుతున్న సమయంలో వినియోగిస్తున్నట్లు తెలిపారు. షకిల్ ఒక్కడే ఇళ్లలోకి వెళ్లి చోరీ చేస్తే.. మిగతా ఇద్దరు చుట్టు పక్కల గమనిస్తూ ఉంటారని సీపీ తెలిపారు. చోరీలకు ఉపయోగించిన కారుతోపాటు నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామన్నా రు. ఏసీపీ ప్రకాష్ యాదవ్, నవీపేట ఎస్సై శ్రీకాంత్, నార్త్ సీఐ శ్రీనివాస్, సీసీఎస్ ఏసీపీ శ్రీశైలం, సీఐ అజయ్‌కుమార్, హెడ్ కానిస్టేబుల్ స్వామిగౌడ్, రాజారెడ్డి, రాజేశ్, సాగర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


