డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): సబ్ జూనియర్ (అండర్–15) మహిళల ఆసియా కప్ సాఫ్ట్బాల్ పోటీల్లో భారత జట్టు తరఫున మండలంలోని సుద్దపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినులు డి.లిఖిత, ఈ.వర్షిణిలు పాల్గొన్నట్లు ప్రిన్సిపాల్ నళిని తెలిపారు. చైనాలోని వెయ్ హై నగరంలో గత నెలలో పోటీలు నిర్వహించారన్నారు. ఉత్తమ ప్రతిభకనబర్చిన క్రీడాకారిణులను బుధవారం పాఠశాలలో సన్మానించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ నళిని మాట్లాడుతూ.. తమ పాఠశాల విద్యార్థినులు అంతర్జాతీయ స్థాయిలో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ జ్యోత్స్న, వ్యాయామ ఉపాధ్యాయురాలు నర్మద, సాఫ్ట్బాల్ అకాడమీ కోచ్ మౌనిక తదితరులు పాల్గొన్నారు.


