నిజామాబాద్ రూరల్: చెత్త ద్వారా బయోమైనింగ్ ను వేగవంతం చేసి వెయ్యి మెట్రిక్ టన్నులకు పెంచాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. ఇంటింటికి తిరుగుతూ చెత్తను సేకరించే ప్ర క్రియను పకడ్బందీగా పర్యవేక్షించాలన్నారు. నిజామాబాద్ నగర శివారులోని నాగారం ప్రాంతంలో ఉన్న డంపింగ్ యార్డును కలెక్టర్ బుధవారం సందర్శించారు. చెత్తను డంపింగ్ యార్డులో నిలువ చేస్తు న్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్.. చెత్తను వేరు చేస్తూ ఎరువులు, ఇతర అవసరాల వి నియోగం కోసం యంత్రాల సహాయంతో శుద్ధి చేస్తున్న విధానానికి సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. డంపింగ్ యార్డు ప్రాంతంలో ఖాళీ స్థలాలను గుర్తించి విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, పచ్చదనం పెంపొందించాలన్నా రు. డంపింగ్ యార్డు ప్రాంతంలో సోలార్ ప్యానెల్స్‌తో పని చేసే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, వ్యర్థాల శుద్ధి ప్రక్రియ ను నిశితంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. డంపింగ్ యార్డు ప్రదేశంలో రోడ్డుకు ఆనుకుని ఇరువైపులా వ్యర్థాలను పోగు చేయకుండా దూరంగా తరలించాలన్నారు.
రోడ్లపై ఎక్కడబడితే అక్కడ పశువులు సంచరించకుండా తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. డంపింగ్ యార్డు ప్రాంతంతోపాటు నగరంలోని ప్రధాన రహదారులపై ఆవులు, ఇతర పశువులు ఎక్కడబడితే అక్కడ సంచరిస్తుండడాన్ని గమనించిన కలెక్టర్.. అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. రోడ్లపై పశువుల సంచారం కారణంగా వాహనదారులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ప శువులు రోడ్లపై సంచరించకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లపై పశువులను వదిలితే కే సులు నమోదు చేయాలని, జరిమానా విధించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్‌కుమార్ తదితరులున్నారు.
రోడ్లపై పశువులను వదిలితే..
కేసులు పెట్టండి
అధికారులతో కలెక్టర్ ఇలా త్రిపాఠి
నాగారంలోని డంపింగ్ యార్డు
పరిశీలన


