డ్రమ్మెడు నీళ్ల కోసం.. బారెడు క్యూ
ఆర్వోబీకి
డీఎస్ కాలనీలో ట్యాంకర్ వద్ద క్యూలో పెట్టిన బ్యారెళ్లు
50 క్వార్టర్స్‌లో బ్యారెళ్లలో నీటిని పట్టుకుంటున్న స్థానికులు
డీఎస్ కాలనీలో ఇళ్ల ముందు నీటితో నింపిన డ్రమ్ములు
నిజామాబాద్ నగరంలోని డీఎస్ కాలనీ, 50 క్వార్టర్స్, వడ్డెర కాలనీలలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. వారం క్రితం పైప్‌లైన్ పగిలిపోవడంతో నల్లా నీళ్లు రావడం లేదు. దీంతో అధికారులు ట్యాంకర్ ద్వారా నీటిని పంపిస్తున్నారు. అయితే వాటర్ ట్యాంకర్ గల్లీల్లోకి వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆయా కాలనీలవాసులు బిందెలు, డ్రమ్ములను తీసుకుని రోడ్డుపైకి వచ్చి క్యూ కడుతున్నారు. డ్రమ్ములలో నింపుకుని తర్వాత బిందెల ద్వారా ఇళ్లకు తీసుకువెళ్తున్నారు. సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్
మాధవనగర్ వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాకేంద్రానికి కీలకమైన మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పను లు పూర్తిచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా నిధులు కేటాయించింది. రూ.8.68 కోట్లు మంజూరుచేయడంతో పెండింగ్ పనుల్లో మళ్లీ కదలిక రానుంది. డిచ్‌పల్లి – నిజామాబాద్ మధ్యలో బైపాస్ వద్దనున్న ఈ లెవల్ క్రాసింగ్ వద్ద ఆర్వోబీ నిర్మాణంతో దీర్ఘకాలంగా కొనసాగుతున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించనుంది.
రూ.93.12 కోట్ల నుంచి రూ.101.80 కోట్లకు..
మాధవనగర్ ఆర్వోబీ నిర్మాణం కోసం 2022 ఫిబ్రవరి 21న రూ.93.12 కోట్లకు పరిపాలనా అనుమతులు లభించాయి. మొదట డబుల్ రోడ్డుగా ఉన్న ప్రతిపాదన నుంచి తర్వాత నాలుగు లైన్ల ఆర్వోబీగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పనులు పూర్తికాకపోవడంతో ప్రస్తుతం అంచనా వ్యయాన్ని సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రూ.101.80 కోట్లకు పెంచింది.
రాజకీయాంశంగా..
మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం అంశం గత కొన్నేళ్లుగా జిల్లాలోని ప్రధాన రాజకీయపార్టీ లు, నేతలకు రాజకీయాంశంగా మారింది. జిల్లాకేంద్రం నుంచి హైదరాబాద్, కామారెడ్డి వైపు వెళ్లే రోడ్డులో కీలకమైన బ్రిడ్జి నిర్మాణం నాలుగేళ్లుగా పూర్తికాక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే గేటు, ట్రాఫిక్ సమస్యలతోపాటు గుంతలమయమైన రోడ్డుతో వాహనదారులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో రాజకీయ పార్టీల నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఆర్వోబీ అంశం ప్రధాన రాజకీయ ఎజెండాగా మారింది. ఇటీవల జిల్లా కాంగ్రెస్ నేతలు సుదర్శన్‌రెడ్డి, ఎమ్మె ల్యేలు, ముఖ్య నేతలంతా సీఎం రేవంత్‌రెడ్డిని కలసి ఆర్వోబీ నిర్మాణానికి త్వరగా నిధులు మంజూరుచేయాలని విజ్ఙప్తి చేశారు. వారం రోజుల వ్యవధిలోనే బ్రిడ్జి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద నిధులను విడుదల చేయాలని మాధవనగర్ బ్రిడ్జి నిర్మా ణం వద్ద బీజేపీ ధర్నా నిర్వహించింది. ఈ క్రమంలో ఎంపీ అర్వింద్ ధర్మపురి నిధుల కోసం భిక్షాటన చేయడంతో ఇరుపార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఇప్పటికై నా బ్రిడ్జి నిర్మాణం సకాలంలో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, నేతలు చొరవ తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇద్దరు న్యాయమూర్తుల బదిలీ
నిజామాబాద్ లీగల్: హైకోర్టు మంగళవారం చేపట్టిన బదిలీల్లో భాగంగా జిల్లాలో ఇద్దరు న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. జిల్లా కేంద్రంలోని ఎకై ్సజ్ కోర్టు మెజిస్ట్రేట్‌ను స్థానికంగా ఖాళీగా వున్న జూనియర్ సివిల్ కోర్టు జడ్జిగా బదిలీ చేయడంతోపాటు ఎకై ్సజ్ కోర్టు, మొబైల్ కోర్టు మెజిస్ట్రేట్‌గా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. అలాగే బోధన్ కోర్టు మెజిస్ట్రేట్‌గా పనిచేస్తున్న ఇసాంపల్లి సాయిశివను యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరికి బదిలీ చేశారు. ఆయన స్థానంలో బోధన్‌లోనే కొనసాగుతున్న మరో మెజిస్ట్రేట్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే జిల్లా కేంద్రంలో మొదటి అదనపు కోర్టు మెజిస్ట్రేట్, ఎకై ్సజ్, మొబైల్ కోర్టు మెజిస్ట్రేట్‌గా పనిచేసిన వారు పదోన్నతులపై వెళ్లడంతో గత ఐదు నెలలుగా ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తాజాగా బోధన్ కోర్టు మెజిస్ట్రేట్ సైతం బదిలీ కావడంతో జిల్లాలో నాలుగు జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వెంటనే భర్తీ చేయాలని న్యాయవాదులు కోరుతున్నారు.
జాప్యం కారణంగా పెరిగిన వ్యయం
మాధవనగర్ ఆర్వోబీని రెండేళ్లలోనే పూర్తిచేయా ల్సి ఉండగా.. నిధుల కేటాయింపులో జాప్యం కా రణంగా నాలుగేళ్లయినా ప ను లు పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రధానంగా నిధుల విడుదలలో జా ప్యం, కాంట్రాక్టర్‌కు బిల్లుల చెల్లింపు ఆలస్యంతో పనులు ఆగిపోయాయనే విమర్శ ఉంది.నిరాసక్తతతో ఇద్దరు కాంట్రాక్టర్లు మారా రు. ఆర్వోబీ నిర్మాణానికి ఏళ్లుగా ఆలస్యం కావ డం ఈ క్రమంలో భూసేకరణ, డిజైన్ మార్పు లు, నిర్మాణ సామగ్రి ధర పెరుగుదలతో అంచనా వ్యయం రూ.101.80 కోట్లకు పెరిగిందని చెబుతున్నారు. ఆర్వోబీ నిర్మాణంలో భా గంగా ఇంకా గడ్డర్లు, పేవ్‌మెంట్‌ల నిర్మాణం, సర్వీస్ రో డ్లు, అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. తాజాగా నిధుల కేటాయింపుతో వేగంగా పనులు చేపడితే నగరవాసులు ప్రయోజనం కలుగనుంది.
మాధవనగర్ రైల్వే బ్రిడ్జికి రూ.8.68 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
సవరించిన అంచనాలతో తాజా
వ్యయం మొత్తం రూ.101.80 కోట్లు
తాజాగా నిధుల కేటాయింపుతో
బ్రిడ్జి నిర్మాణ పనుల్లో కదలిక


