జక్రాన్‌పల్లి : జవహర్ నవోదయ క్యాంపస్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. మండలంలోని కలిగోట్‌లో నూతనంగా నెలకొల్పుతున్న జవహర్ నవోదయ విద్యాలయ నూతన క్యాంపస్ భవన నిర్మాణ ప్రదేశాన్ని కలెక్టర్ మంగళవారం సందర్శించారు. జేవీఎన్ నిర్వహణకు అనువైన పరిస్థితులు, అందుబాటులో ఉన్న వసతులను నిశితంగా పరిశీలించారు. ఇప్పటివరకు చేపట్టిన ప నుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పను లు చేపట్టే క్రమంలో ఏవైనా ఆటంకాలు ఎదురవుతున్నాయా? అని ఆరా తీయగా.. అటవీ శాఖతోపాటు ఇతర అన్ని రకాల అనుమతులు తీసుకున్నామని, ఎలాంటి సమస్యలు లేవని సంబంధిత అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల ప్రయోజనార్థం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నవోదయను ఏర్పాటు చేస్తోందని, దీనిని దృష్టిలో పెట్టుకుని నిర్దేశిత గడువులోగా పనులు పూర్తయ్యేలా చొరవ చూపాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక, మొరం కోసం నిబంధనల మేరకు వెంటవెంటనే అనుమతులు మంజూరు చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. కనీసం రెండుమూడు వారాలకు ఒక సారి పనులను పరిశీలించి ప్రగతి వివరాలను తన కు నివేదించాలని ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియాకు సూచించారు. కలెక్టర్ వెంట సర్పంచ్ రా జు, తహసీల్దార్ కిరణ్మయి, ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మోహన్ భట్, ఎంపీడీవో సతీశ్‌కుమార్, నవోదయ ప్రిన్సిపాల్ నటరాజ్, ఆర్‌ఐ ప్రవీణ్, విద్యుత్ ఏఈ భాస్కర్, ఉప సర్పంచ్ సత్తెమ్మ, పీఆర్ ఏఈ సురేంద్రవర్మ, ఎంఈవో శ్రీనివాస్ ఆయా శాఖల అధికారులు ఉన్నారు.
రెండుమూడు వారాలకోసారి పనుల ప్రగతి నివేదికను అందించాలి
అధికారులకు కలెక్టర్
ఇలా త్రిపాఠి ఆదేశాలు
కలిగోట్‌లో పనుల పరిశీలన


