టీచర్లకు టెట్‌ మాక్‌టెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

టీచర్లకు టెట్‌ మాక్‌టెస్ట్‌

Nov 4 2026 2:32 AM | Updated on Nov 4 2026 2:32 AM

ఖలీల్‌వాడి: చాక్‌పీస్‌లతో బ్లాక్‌బోర్డులపై ఏళ్లుగా పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయులు ఇన్‌ సర్వీస్‌ టెట్‌ (టీచర్‌ ఎల్జిబిలిటీ టెస్ట్‌) రాయడంలో ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను గుర్తించిన పాఠశాల విద్యా శాఖ అధికారులు కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) విధానంపై అవగాహన కల్పించేందుకు జిల్లాలో మాక్‌ టెస్ట్‌లు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు పరీక్ష కేంద్రాలు కేటాయించారు. గత నెల 8, 9 తేదీల్లో నిర్వహించిన ఇన్‌ సర్వీస్‌ టెట్‌కు 1584 మంది టీచర్లు దరఖాస్తు చేసుకోగా.. 1432 మంది పరీక్షకు హాజరయ్యారు. 1006 మంది క్వాలిఫై కాగా, మిగిలినవారు ఫెయిలయ్యారు.

ఈనెల 16 నుంచి..

ఈనెల 16 నుంచి 21వ తేదీ వరకు స్పెషల్‌ టీజీ టెట్‌ నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దరఖాస్తు ప్రక్రియ సైతం ముగిసింది. అయితే మాక్‌ టెస్ట్‌ రాసేందుకు పేపర్‌–1, పేపర్‌–2కు 540 మంది టీచర్లు దరఖాస్తు చేసుకోగా.. నలుగురు రిజెక్ట్‌ అయ్యారు. సర్వీసులో ఉన్న టీచర్లలో చాలామందికి ఆన్‌లైన్‌లో పరీక్షలు కొత్త కావడంతో మౌస్‌ ఆపరేషన్‌, టైమర్‌ను గమనించడం, స్క్రీన్‌పై ప్రశ్నలను మార్చడం వంటి అంశాల్లో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో టెట్‌ను గతంలో మాదిరిగా ఆఫ్‌ లైన్‌ లేదా ఓఎంఆర్‌ విధానంలో నిర్వహించాలని పలు ఉపాధ్యాయ సంఘాలు జిల్లా విద్యాశాఖ అధికారులకు విన్నవించాయి. టెట్‌ పరీక్ష విధానాన్ని మార్చడం కుదరదని, సీబీటీ విధానంలోనే నిర్వహిస్తామని ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. దీంతో మాక్‌ టెస్టుల ద్వారా టీచర్లకు పరీక్షకు సన్నద్ధం చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈనెల 5 నుంచి 10వ తేదీ వరకు మాక్‌ టెస్టులు నిర్వహించనున్నారు. అధికారిక వెబ్‌ సైట్‌ schooledu.telangana.gov.inలో లింక్‌ ఉంచనున్నారు. స్పెషల్‌ టెట్‌కు దరఖాస్తు చేసుకున్న టీచర్లు వెబ్‌ సైట్‌ ద్వారా లేదా జిల్లాల్లో ఏర్పాటు చేసే ప్రత్యేక కేంద్రాల్లో మాక్‌ టెస్టులు రాసే అవకాశం ఉంటుంది. మాక్‌ టెస్ట్‌ల కోసం జిల్లాలోని ఐదు స్కూళ్లను ఎంపిక చేసి ఒక్కో కేంద్రంలో కనీసం 20 కంప్యూటర్లతో ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇన్‌ సర్వీస్‌ టెట్‌ రాయడం రాని టీచర్లు ఎందరో..!

సీబీటీపై ఉపాధ్యాయులకు అవగాహన

ఈనెల 5 నుంచి నమూనా పరీక్షలు

జిల్లాలో ఐదు స్కూళ్ల ఎంపిక

కేంద్రాలు..

జిల్లాలో టీచర్లు

అవకాశాన్ని సద్వినియోగం..

జిల్లాలోని ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులందరూ మాక్‌ టెస్ట్‌ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పరీక్షకు సమర్థవంతంగా సిద్ధం కావాలి. ఉపాధ్యాయులకు ఇబ్బందులు లేకుండా జిల్లాలోని ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాల్లో సరిపడా కంప్యూటర్లను అందుబాటులో ఉంచాం.

– సాయాగౌడ్‌, డీఈవో, నిజామాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement