● విజేతలుగా బాలికల విభాగంలో ఆర్మూర్ జోన్..
● బాలుర విభాగంలో బాల్కొండ జోన్
నందిపేట్(ఆర్మూర్): నిజామాబాద్ జిల్లా స్థాయి అండర్–17 బాలబాలికల వాలీబాల్ టోర్నమెంట్ ను నందిపేట మండల కేంద్రంలోని శ్రీగీతా కాన్వెంట్ హైస్కూల్ ప్రాంగణంలో మంగళవారం నిర్వహించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన టోర్నీలో 15 జోన్‌లకు చెందిన బా లుర, బాలికల 30 పాల్గొన్నాయి. మండల విద్యాధికారి అవధూత గంగాధర్, స్కూల్ గేమ్స్ ఫెడరేష న్ జిల్లా కార్యదర్శి అలివేలు మాట్లాడుతూ.. క్రీడలు శారీరక ధృడత్వంతోపాటు క్రమశిక్షణ, పట్టుదల, జట్టుగా పనిచేసే తత్వాన్ని పెంపొందిస్తాయన్నారు. రసవత్తరంగా సాగిన పోటీల్లో బాలికల విభాగంలో ఆర్మూర్ రూరల్ జోన్ మొదటి స్థానంలో నిలువగా, నందిపేట జోన్ రెండో స్థానంలో నిలిచింది. బాలుర విభాగంలో మొదటి స్థానంలో బాల్కొండ జోన్, రెండో స్థానంలో ఆర్మూర్ రూరల్ జట్లు విజేతలుగా నిలిచాయి. విజేతలుగా నిలిచిన జట్లకు బహుమతులు అందజేశారు. సర్పంచ్ ఎర్రం లింగం, ఎస్సై వినయ్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు బొబ్బిలి నర్సయ్య, టీఎస్ పేటా అధ్యక్షుడు రవి, గోపిరెడ్డి, గీతా కాన్వెంట్ పాఠశాల కరస్పాండెంట్ గంగాసాగర్, డైరెక్టర్ కానూరి శోభ, ప్రధానోపాధ్యాయులు గంగాభూషణ్, పీఈటీలు, ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎంఈవో అవధూత గంగాధర్.. విజేతగా నిలిచిన బాలికల జట్టు


