బోధన్: పట్టణంలో మంగళవారం వీరశైవ సమాజ్ జంగమ, లింగాయత్ సమాజ్‌ల రాష్ట్ర, జిల్లా, పట్టణ ప్రతినిధులు ‘మన్మథస్వామి పుణ్యక్షేత్రానికి పాదయాత్ర’ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈసందర్భంగా సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ.. మహరాష్ట్ర ప్రాంతంలోని బీడ్ జిల్లాలోగల మాంజర్ సోంబ గ్రామ శివారు ప్రాంతంలో వెలసిన శ్రీక్షేత్ర కపిలధార మన్మథస్వామి పుణ్యక్షేత్రం దర్శనానికి ఈనెల 11న పాదయాత్ర ప్రారంభంకానున్నట్లు తెలిపారు. జంగంగల్లీలోని పురాణే మఠం నుంచి వీరశైవుల గురువు సుంకిని సిద్దేశ్వర మహారాజ్ మార్గదర్శకత్వంలో, సంతోశ్ సిద్దేశ్వర మహారాజ్, మఠం నిర్వాహకులు పురాణే అజయ్‌కుమార్, పౌడయ్య రాజేందర్‌ల అధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభమై 15 రోజుల పాటు కొనసాగి 360 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలయాన్ని దర్శిస్తారన్నారు. ఈ క్షేత్రంలో పుణ్యస్నానాలు ఆచరించి వీరశైవుల ఆరాధ్య గురువు మన్మథస్వామి దివ్య జీవసమాధిని పాదయాత్రికులు, భక్తులు దర్శించుకుంటారన్నారు. లింగాయత్ సమాజ్ రాష్ట్ర ప్రతినిఽధి న్యాయవాది శ్యాంరావు, జిల్లా అధ్యక్షులు వీఆర్‌దేశాయ్, ఏకచక్రేశ్వరాలయ కమిటి చైర్మన్ లక్ష్మణ్ పటేల్,జంగమ సమాజ్ పట్టణ అధ్యక్షుడు నర్సింగ్ అప్ప, ప్రతినిధులు ప్రభుఅప్ప, శంకర్ అప్ప, పురాణే దిలీప్ కుమార్, గణపతి అప్ప, తదితరులు పాల్గొన్నారు.


