● బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి
● మేడిగడ్డ బ్యారేజీ సందర్శన
వేల్పూర్(బాల్కొండ): మేడిగడ్డ వద్ద వృథాగా దిగు వకు తరలిపోతున్న నీటిని రివర్స్ పంపింగ్‌తో ఎ స్సారెస్పీతోపాటు రిజర్వాయర్లన్నింటిని నింపొచ్చని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లా బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు మంగళవారం మొదట కాళేళ్వరం ప్రాజెక్టు పరిధిలోని ప్రాణహిత, గోదావరి సంగమ ప్రాంతాన్ని, సిరోంచ, కాళేళ్వరం మద్య గోదావరిలో ఉన్న నీటి ప్రవాహాన్ని, కన్నెపల్లి పంప్‌హౌజ్ ప్రాంతాన్ని, మేడిగడ్డ బ్యారేజీ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ప్రశాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మేడిగడ్డ వద్ద దాదాపు 22 వేల క్యూసెక్కుల ప్రవాహం(రోజుకు 2 టిఎంసీల నీరు) వృథాగా దిగువకు తరలిపోతోందన్నారు. కన్నెపల్లి పంపుహౌజ్ పంపులు ఆన్‌చేసి ఎస్సారెస్పీ, నిజాంసాగర్ సహా మిడ్‌మానేరు, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయకసాగ ర్ వంటి రిజర్వాయర్లన్నిటిని నింపవచ్చన్నారు. కా నీ కేసీఆర్‌కు పేరు రాకూడదనే దుర్భిద్దితోనే నీళ్లను సముద్రం పాలు చేస్తున్నారని ఆరోపించారు. సాగునీరు విడుదల చేయకపోతే కేటీఆర్ నాయకత్వంలో రైతు పోరుబాట తప్పదన్నారు. మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్‌గుప్తా, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, మాజీ విప్ గంపగోవర్ధన్, హన్మంత్‌షిండే, పుట్టమధు, విఠల్‌రావు, షేక్ ముజీబొద్దిన్ తదితరులు పాల్గొన్నారు.
నృసింహుడి సన్నిధిలో మాజీ ఎమ్మెల్యేలు
ధర్మపురి: జగిత్యాల జిల్లా ధర్మపురిలోని శ్రీలక్ష్మినృసింహస్వామిని మంగళవారం బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు. నిజామాబాద్ అర్బన్, రూరల్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గణేష్‌గుప్తా, జీవన్‌రెడ్డి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు రంజిత్, చిలువేరు శ్యామ్, తదితరులు ఉన్నారు.


