తెయూలో చెస్‌టోర్నీ ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

తెయూలో చెస్‌టోర్నీ ఎంపికలు

Nov 4 2026 2:08 AM | Updated on Nov 4 2026 2:08 AM

తెయూలో చెస్‌టోర్నీ ఎంపికలు తాగునీటి సరఫరాను నిర్లక్ష్యం చేయొద్దు ట్రాలీఆటోను ఢీకొన్న కారు: ఒకరి మృతి

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్‌ కళాశాల మినీ సెమినార్‌ హాల్‌లో మంగళవారం వర్సిటీ అంతర కళాశాలల చెస్‌ (మెన్‌) టోర్నమెంట్‌ నిర్వహించారు. వర్సిటీ స్పోర్ట్స్‌ ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ బీఆర్‌ నేత మాట్లాడుతూ.. టోర్నీలో ఎంపికై న క్రీడాకారులు డిసెంబర్‌ 3 నుంచి 7వరకు ఆంధ్రప్రదేశ్‌లోని ఆదిత్య యూనివర్సిటీలో జరిగే సౌత్‌ జోన్‌ ఇంటర్‌ యూనివర్సిటీ చెస్‌ టోర్నమెంట్‌లో పాల్గొంటారని తెలిపారు. టోర్నీలో విజేతలుగా కార్తీక్‌, జోసెఫ్‌, విగ్నేష్‌ (తెయూ), కార్తీకేయ (ట్రైబల్‌ వెల్ఫేర్‌ డిగ్రీ కాలేజ్‌, కామారెడ్డి), శ్రీనివాస్‌ (జీజీ కాలేజ్‌, నిజామాబాద్‌) ఎంపికయ్యారన్నారు. ముగింపు కార్యక్రమంలో విజేతలకు వైస్‌ ప్రిన్సిపాల్‌ లక్ష్మణచక్రవర్తి మెడల్స్‌, సర్టిఫికెట్స్‌ అందజేశారు. పీడీలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

మాక్లూర్‌: తాగునీటి సరఫరాను నిర్లక్ష్యం చేయొద్దని, లీకేజీలు, పైప్‌లైన్‌ వ్యవస్థను చక్కబెట్టుకోవాలని ఇన్‌చార్జి డీపీవో నాగరాజు సూచించారు. మండలంలోని ఆయా గ్రామాలకు సరాఫరా అవుతున్న మిషన్‌ భగీరథ నీటిపై సంబంధిత అధికారులకు మాక్లూర్‌లో మంగళవారం శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలు, వాటిని ఏ విధంగా వాడుకోవాలి, గ్రామాల్లో నీటిని వృథా చేయకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై పలు సూచనలు చేశారు. తాగునీటి సరాఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులు, మిషన్‌ భగీరథ ఏఈలదేనని స్పష్టం చేశారు. సర్పంచ్‌ ఎస్‌ వెంకటేశ్వర్‌రావు, పంచాయతీ కార్యదర్శి రాకేశ్‌, ఆర్మూర్‌ డీఎల్‌పీవో శివకృష్ణ, ఎంపీవో, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

● మరో ఇద్దరికి గాయాలు

వేల్పూర్‌(బాల్కొండ): బాల్కొండలోని 44 నంబరు జాతీయ రహదారిపై పెద్దమ్మగుడి సమీపంలో ట్రాలీఆటోను కారు ఢీకొనడంతో ఒకరు మృతిచెందాగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా.. బాల్కొండకు చెందిన పిప్పెర శ్రీనివాస్‌(47) మంగళవారం సాయంత్రం తన ట్రాలీఆటోలో డ్రింకింగ్‌ వాటర్‌ సరఫరా చేస్తూ పెద్దమ్మగుడి వైపు ఉన్న పెట్రోలు పంపు వద్దకు వెళ్లాడు. శ్రీనివాస్‌ తిరిగి వస్తుండగా, నిర్మల్‌ వైపు వెళ్తున్న కారు అతి వేగంగా వచ్చి ట్రాలీఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనివాస్‌ తీవ్రంగా గాయపడ్డాగా, స్థానికులు గుర్తించి అతడిని చికిత్స నిమిత్తం ఆర్మూర్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు. కారులో ప్రయాణిస్తున్న నిర్మల్‌ జిల్లా చిట్యాల గ్రామానికి చెందిన చిన్నయ్య, దాసెట్టి నారాయణకు గాయాలు కాగా చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు బాల్కొండ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

చిరుత దాడిలో మేకకు గాయాలు

లింగంపేట: మండలంలోని పోతాయిపల్లి శివారు లో మంగళవారం సాయంత్రం చిరుత దాడిలో మేక తీవ్రంగా గాయపడినట్లు మేకల కాపరి ఎర్రం రాజ య్య తెలిపారు. ఉదయం మేకలను అటవీ ప్రాంతానికి మేతకు తీసుకెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వ స్తుండగా మల్లన్న గుడి వద్ద మేకలపైకి అకస్మాతు గా చిరుత దాడికి పాల్పడిందన్నారు. తాను కేకలు వేయడంతో చిరుత మేకను వదిలి అడవిలోకి పారిపోయిందన్నారు. అటవీశాఖ అధికారులు చిరుతను పట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement