సుభాష్‌నగర్: ఎన్‌డీసీసీబీ అభివృద్ధిలో పీఏసీఎస్‌ల పాత్ర కీలకమని అదనపు కలెక్టర్, పీఐసీ సభ్యులు రాజాగౌడ్ అన్నారు. నగరంలోని ఎన్‌డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం 104వ వార్షిక మహాజన సభ పీఐసీ సభ్యులు రాజాగౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈసందర్భంగా బ్యాంకు సీఈవో నాగభూషణం వందే బ్యాంకు ఆర్థిక పరిస్థితిని సభకు వివరించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. బ్యాంకు నిరంతరం అభివృద్ధిపథంలో పయనిస్తూ, ఆర్థికంగా మరింత బలోపేతం అవుతున్నందుకు సీఈవో, ఉన్నతాధికారులు, సిబ్బంది, పీఏసీఎస్‌ల అధ్యక్షులకు అభినందనలు తెలియజేశారు. సీఈవో నాగభూషణం వందే మాట్లాడుతూ.. సభ్య సంఘాల సహకారంతో ఇటీవల బ్యాంకు రాష్ట్రస్థాయిలో అత్యుతమంగా ఉంటూ నాబార్డ్, టీజీసీఏబీ ద్వారా ఉత్తమ అవార్డు అందుకుందన్నారు. సొసైటీ చైర్మన్లు పలు ముఖ్యమైన అంశాలపై చర్చించారు. ఇటీవల సొసైటీ చైర్మన్లుగా బాధ్యతలు స్వీకరించిన వారికి అదనపు కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. పీఐసీ సభ్యులు, డీసీవో శ్రీనివాస్‌రావు, కామారెడ్డి డీసీవో రామ్మోహన్, బ్యాంకు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


