● 42.195 కిలోమీటర్ల మారథాన్
6.18 గంటల్లో పూర్తి
సుభాష్‌నగర్: ఎస్‌ఈబీ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన హైటెక్ మారథాన్ (ఫుల్)లో నిజామాబాద్ విజిలెన్స్ అండ్ ఏపీటీఎస్ పోలీస్‌స్టేషన్ ఎస్సై సుధాకర్ పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచారు. మొత్తం 42.195 కిలోమీటర్ల దూరాన్ని 6 గంటల 18 నిమిషాల్లో విజయవంతంగా పూర్తిచేశారు. సుధాకర్‌కు ఇది రెండో ఫుల్ మారథాన్ కావడం విశేషం. ఈ ఏడాది ఇప్పటివరకు రెండు హాఫ్ మారథాన్‌లు, రెండు ఫుల్ మారథాన్‌లు పూర్తి చేసి తన పరుగుల ప్రస్థానంలో మరో మైలురాయిని అధిగమించారు. పోలీస్‌శాఖలో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూనే, శారీరక దృఢత్వం, ఆరోగ్యం, క్రమశిక్షణకు ప్రా ధాన్యతనిస్తూ పరుగును తన జీవితంలో భాగంగా చేసుకున్నారు. పరుగులు కేవలం పతకాలు, రికార్డు ల కోసం మాత్రమే కా కుండా ఆరోగ్యకరమైన జీవనశైలి, మానసిక ధై ర్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ఎంతో ఉపయోగపడతా యని సుధాకర్ అన్నారు. విధి నిర్వహణతోపాటు ఫిట్‌నెస్‌కు సమయం కేటాయిస్తూ యువతకు ఆరోగ్యం, క్రమశిక్షణ, పట్టుదల ప్రాముఖ్యతను తెలియజేయడమే తన విలేజ్ 2 విజన్ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.


